Viral Photo: ఫుట్ పాత్‌పై చిన్నారి ఓ వైపు జీవితం కోసం చిరు ధ్యాన్యాలు అమ్మకం.. మరోవైపు భవిష్యత్ కోసం చదువు..

Viral Photo: మనస్సు ఉంటే మార్గం ఉంటుంది.  ఏదైనా చేయాలనే తపన.. దానిని సాధించాలనే సంకల్పం .. అందుకు తగిన కృషి, పట్టుదల ఉంటే.. ఎటువంటి కష్టాలు ఏర్పడినా ఇష్టాలుగా..

Viral Photo: ఫుట్ పాత్‌పై చిన్నారి ఓ వైపు జీవితం కోసం చిరు ధ్యాన్యాలు అమ్మకం.. మరోవైపు భవిష్యత్ కోసం చదువు..
Representative Image
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2022 | 8:23 AM

Viral Photo: మనస్సు ఉంటే మార్గం ఉంటుంది.  ఏదైనా చేయాలనే తపన.. దానిని సాధించాలనే సంకల్పం .. అందుకు తగిన కృషి, పట్టుదల ఉంటే.. ఎటువంటి కష్టాలు ఏర్పడినా ఇష్టాలుగా మారతాయి. ఈ మాటను నిజం చేసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారు ఓ వైపు గర్వంగా ఉంది అంటూనే.. మరోవైపు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ దీని నుండి ప్రేరణ కూడా పొందుతున్నారు. ఎందుకంటే ఓ చిన్నారి చదువుకోవాలనే పట్టుదల ఈ ఫొటోలో కనిపిస్తోంది.

ఒక చిన్న అమ్మాయి పేవ్‌మెంట్‌పై కూర్చుని పక్షుల కోసం చిరు ధాన్యాలు అమ్ముతుంది. అంతేకాదు మరోవైపు చిన్నారి బాలిక చదువుకోవడం చిత్రంలో కనిపిస్తుంది. అయితే.. ఈ చిన్నారి చిత్రం ఎక్కడిది అనే విషయంపై ఖచ్చితమైన సమాచారం లేదు. చదువు కోవాలనే ఇష్టం.. కోరికను మనిషిని ఎంత వరకు తీసుకువెళుతుందో ఈ చిత్రాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. అంతే కాదు, ఈ అభిరుచి ఇచ్చే ఫలాన్ని భవిష్యత్తులో విజయం రూపంలో ఆ చిన్నారికి దక్కుతుంది.

ఇక్కడ చిత్రాన్ని చూడండి

ఈ ఫోటోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు.. క్యాప్షన్‌లో  దుష్యంత్ కుమార్ హిందీ పద్యం పంక్తిని కూడా పంచుకున్నారు. ‘ఎక్కడైనా నిప్పు ఉంది, అయితే ఆ నిప్పు మండాలి’ అని రాశారు. ఈ ఫోటోని ఇప్పటివరకు 800 మందికి పైగా రీట్వీట్ చేయగా, సుమారు 5 వేల మంది షేర్ చేశారు. ఇప్పటివరకు 300 మందికి పైగా కామెంట్ చేశారు.

మరోక నెటిజన్ ‘విద్యను నేర్చుకోవాలంటే స్థలంతో సంబంధం లేదు.. నీ పట్టుదల చాలా బాగుంది, కొనసాగించండి… మీ బంగారు భవిష్యత్తు కోసం మీకు శుభాకాంక్షలు’ అని రాశారు. అదే సమయంలో, మరొక వినియోగదారు, ‘మేము భూమి నుండి వచ్చాము, మేము భూమితో కనెక్ట్ అవుతాము, చూడండి..  ఒక రోజు మనం ఎత్తుకు ఎదుగు తాము’ అని వ్రాసాడు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Visakhapatnam: మొదలైన చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

 ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది.. అదెలాగో ఈ ఫోటోపై లుక్కేస్తే తెలుస్తుంది..!