AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది.. అదెలాగో ఈ ఫోటోపై లుక్కేస్తే తెలుస్తుంది..!

Optical Illusion: కొందరు సైకాలజిస్టులు ఎదుటి వారి మనస్తత్వాన్ని ఈజీగా అంచనా వేస్తుంటారు. మరికొందరు జ్ఞానులు కూడా ఎదుటి వారిని చూడగానే వారి వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంటారు.

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది.. అదెలాగో ఈ ఫోటోపై లుక్కేస్తే తెలుస్తుంది..!
Optical Illusion
Shiva Prajapati
|

Updated on: May 03, 2022 | 8:00 AM

Share

Optical Illusion: కొందరు సైకాలజిస్టులు ఎదుటి వారి మనస్తత్వాన్ని ఈజీగా అంచనా వేస్తుంటారు. మరికొందరు జ్ఞానులు కూడా ఎదుటి వారిని చూడగానే వారి వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంటారు. అయితే, మనుషులే కాదు.. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్ధేశిస్తాయి. అవును.. ఒక ఫోటోను మనం చూసే విధానాన్ని బట్టి అది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఆ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది.

తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మొదటగా ఏం చూస్తారో అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఆ ఫోటోను షేర్ చేసిన యూజర్స్ చెబుతున్నారు. ఈ ఫోటో రెండు రకాలుగా కనిపిస్తుంది. మొదట ఒక వ్యక్తి మొహం కనిపిస్తుంటుంది. మరోటి ఒక నల్లని పొడవాటి జుట్టు ఉన్న స్త్రీ నేలపై కూర్చుని ఉన్నట్లుగా కనిపిస్తుంది. బ్రైట్ సైడ్ అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ ప్రకారం.. మీకు మొదట స్త్రీ ఆకారం కనిపిస్తే.. మీరు పదునైన పరిశీలనా నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు. మీ దృష్టికోణం చాలా తీక్షణంగా ఉంటుంది. అలాగే మీరు రిజర్డ్వ్, అంతర్ముఖ వ్యక్తి అని పేర్కొన్నారు. ఇలాంటి వారు ప్రజలు మధ్యన ఎక్కువగా ఉండలేరు. సిగ్గుపడుతుంటారు. ప్రజలు కూడా మిమ్మల్ని నిశ్శబద్ధ వ్యక్తులుగా పరిగణిస్తారు. ఇతరులు మిమ్మల్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.

ఇక మొదట విశాలమైన దవడ ఉన్న వ్యక్తి ముఖ చిత్రం కనిపిస్తే.. మీరు వివరాలను విస్మరించి పెద్ద చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. మీరు బహిర్ముఖ వైపు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరులతో ఎక్కువగా సన్నిహితంగా మెలుగుతారు. సమస్యలను చర్చించడం ద్వారా పరిష్కరించుకోవడానికి ఇష్టపడుతారు. బహిరంగమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అందరితో స్నేహ పూర్వకంగా ఉంటారు. మరి మీ వ్యక్తి్త్వం ఏంటిదో ఈ ఫోటోను చూసి అంచనా వేసుకోండి.

Also read:

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!