AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Telangana: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పై కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ ఉపయోగిస్తోందా..? సెంటిమెంట్ పాలిటిక్స్ చేసే పార్టీని అదే సెంటిమెంట్‌తో తిప్పి కొట్టాలని చూస్తోందా..?

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!
Rahul Gandhi
Shiva Prajapati
|

Updated on: May 02, 2022 | 9:32 PM

Share

Telangana: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పై కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ ఉపయోగిస్తోందా..? సెంటిమెంట్ పాలిటిక్స్ చేసే పార్టీని అదే సెంటిమెంట్‌తో తిప్పి కొట్టాలని చూస్తోందా..? అయితే ఓయూ.. లేకపోతే చంచల్ గూడ జైలు కేంద్రంగా కాంగ్రెస్ రాజకీయాలు మారడానికి కారణం ఏంటి..? కాంగ్రెస్ లేపుతున్న సెంటిమెంట్ వల్ల పార్టీకి మైలేజ్ వస్తుందా..?

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన దగ్గర పడుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కయి. అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉపయోగించిన పాలిటిక్స్ వేరు ఇప్పుడు ఉపయోగిస్తున్న పాలిటిక్స్ వేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా దూకుడుగా వెళ్తుంది. ఇలాగే వెళ్తూ సెంటిమెంట్ తెరమీదకు తీసుకువస్తే మైలేజ్ అదే వస్తుందనే భావన పార్టీ నేతల్లో ఉంది. దీంతో సెంటిమెంట్ రాజకీయాల్లో చేసే అధికార టీఆరెస్ పార్టీని అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలని కసిగా ముందుకు వెళ్తుంది. ఓయూ కేంద్రంగా ఉద్యమాన్ని నడిపిన విద్యార్థులతో అదే ఓయూ కేంద్రంగా రాష్ట్రం ఇచ్చిన పార్టీకి అగ్రనేత ద్వారా విద్యార్థులతో రాష్ట్ర ఆకాంక్ష లు ఎంత వరకు నెరవేరాయని ముచ్చటించడానికి సిద్ధమైంది. అనుమతి ఇవ్వకున్న రాహుల్ గాంధీ ని ఓయూ కు తీసుకెళ్లి తీరుతామని రాష్ట్ర నేతలు తెగేసి చెబుతున్నారు. దీంతో రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఓయూ కి పోతే తప్పేంటనే భావనను జనాల్లోకి బలంగా తీసుకెళ్తుంది.

మరోవైపు రాహుల్ గాంధీ ఓయూ పర్యటన అనుమతి కోరుతూ నిన్న నిరసన తెలుపుతున్న nsui విద్యార్థులను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిపై అక్రమ కేసులు బనాయించారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి లాంటి నేతలు చంచల్ గూడ జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు.అక్కడితో ఆగకుండా జైలు సుపెరిండెంట్ ని కలిసి వతేదీన అరెస్ట్ అయిన 18 మందితో మే 7 వ తేదీన రాహుల్ గాంధీ ములాఖత్ కావడానికి అనుమతి కోరారు.ములాఖత్ హక్కు కాబట్టి కచ్చితంగా ఇవ్వాల్సిందే దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పడానికి చంచల్ గూడ జైలులో రాహుల్ పర్యటన ను ఏర్పాటు చేశారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో 7 వతేదీన గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ తో లంచ్ మీటింగ్ ని ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం మరిచిందని రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తాము అండగా ఉంటామని చెప్తూ ఉద్యమకారులను కాంగ్రెస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు 8400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారిని ప్రభుత్వం విస్మరించడంతో రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు కుటుంబాలతో ముచ్చటించడతో పాటు రైతు డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. దీంతో రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెబుతూ రైతులను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం రాహుల్ ద్వారా జరుగుతుంది.

మరోవైపు మొదటిసారి గాంధీ భవన్ కి రాహుల్ గాంధీ వస్తుండడంతో అక్కడే కీలక సమావేశాలు నిర్వహిస్తుండడం తో తెలంగాణ నేతలకు ఇక నుండి ఎప్పటికి గాంధీల కుటుంబం తోడుంటుందని చెప్పాడనికి రాహుల్ గాంధీ గాంధీ భవన్ కేంద్రంగా సమీక్షలు జరపబోతున్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి మెంబర్షిప్ లో కష్టపడ్డ ఎన్ రోలర్స్ తో రాహుల్ ముచ్చటించనున్నారు.

మొత్తం మీద గతంలో ఎప్పుడు లేని విధముగ కాంగ్రెస్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుండడంతో తాజాగా వస్తున్న మైలేజ్ బాగానే ఉన్నా భవిష్యత్ లో ఈ సెంటిమెంట్ టీఆరెస్ ను డి కొట్టేంత ఉంటుందో లేదో చూడాలి మరి.

Also read:

Congress Politics: కాంగ్రెస్‌లో ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ వ్యవస్థ ఔట్..? పీకే ఎఫెక్టేనా..?

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!

Astro Tips: స్నానం చేసిన తరువాత ఈ 8 పనులు అస్సలు చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!