Hitech Cheating: పెద్ద జాదూగాడు.. ‘ఫోన్ పే’తో ముంచేస్తాడు.. బాధితులు ఎంతమందో తెలిస్తే షాక్ అవుతారు..!

Hitech Cheating: టెక్నాలజీ పెరగడం వల్ల మంచి జరుగుతుందో లేదో తెలియదు. కానీ, అమాయకులు మాత్రం మోసపోతున్నారు. తాజాగా, మొబైల్‌ యాప్స్‌పై గ్రిప్‌ తెచ్చుకున్న ఓ యువకుడు,

Hitech Cheating: పెద్ద జాదూగాడు.. ‘ఫోన్ పే’తో ముంచేస్తాడు.. బాధితులు ఎంతమందో తెలిస్తే షాక్ అవుతారు..!
Chittoor man Arrested
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2022 | 6:15 AM

Hitech Cheating: టెక్నాలజీ పెరగడం వల్ల మంచి జరుగుతుందో లేదో తెలియదు. కానీ, అమాయకులు మాత్రం మోసపోతున్నారు. తాజాగా, మొబైల్‌ యాప్స్‌పై గ్రిప్‌ తెచ్చుకున్న ఓ యువకుడు, లక్షల్లో మోసం చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వినాయకపురం గ్రామానికి చెందిన అరవింద్ హైటెక్‌ మోసానికి పాల్పడుతున్నాడు. పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి, పెట్రోల్ పోసుకునేవాడు. బంక్ యజమాని ఫోన్ పే నెంబర్ అడిగి, ఆ నెంబర్‌ని ఫోన్‌పేలో సెర్చ్ చేసేవాడు. దీంతో బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరున ఉందో తెలిసేది. అలా బ్యాంకింగ్ నేమ్ తెలియగానే, వెంటనే ఖాతా బుక్ యాప్‌లో ఆ పేరే యాడ్ చేసి, ఎంత అమౌంట్ పెట్రోల్ పోసుకున్నామో అంత అమౌంట్ యాడ్ చేసి, రిసివిడ్ అని మెసేజ్‌ని టైప్ చేసి పంపేవాడు. అది కూడా ఫోన్ పే ద్వారా వచ్చినట్టు తెలిసేది.

దాన్ని పెట్రోల్ బంక్‌లో చూపించి వెళ్లిపోయేవాడు. ఇలానే ఇంకా అనేక మోసాలకు పాల్పడ్డాడు అరవింద్. వేరే షాపులైతే ఎక్కువ అమౌంట్ రాదని, నేరుగా గోల్డ్‌ షాపులను టార్గెట్‌ చేశాడు. ఏదో ఒక రకంగా గోల్డ్‌ షాప్ యజమానితో మాట కలపి, ఉంగరాలు, హ్యాండ్ చైన్స్ చూసి సెలెక్ట్‌ చేసుకునేవాడు. ఆ తర్వాత, సేమ్‌ పెట్రోల్‌ బంక్‌లో చేసినట్టే ఫోన్‌పే ద్వారా మోసం చేసి, ఉడాయించేవాడు అరవింద్. షాప్ యజమాని ఆ మెసేజ్ చూసి ఒకే అని ఆ బంగారు ఇచ్చేవారు. కానీ ఏ సినిమాకు అయినా ఎండ్‌ కార్డు ఉంటుంది కదా, అలానే ఓ గోల్డ్‌ షాప్‌ యజమానికి దొరికిపోయాడు ఈ హైటెక్‌ ఫ్రాడర్. ఇలా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సుమారు ఓ ఇరవై దుకాణాల్లో అరవింద్ బాధితులు ఉన్నారు. అతని నుంచి తమ డబ్బులను ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!