Telangana Inter: వెబ్ సైట్ లో తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు.. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 6 నుంచి తెలంగాణ(Telangana) లో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడితే...
ఈ నెల 6 నుంచి తెలంగాణ(Telangana) లో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడితే వెబ్ సైట్ నుంచి నేరుగా హాల్‌టికెట్లు(Hall Tickets) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్ష రాయవచ్చని వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9లక్షల మంది విద్యార్థుల కోసం 1,443 పరీక్షా కేంద్రాలు, 25వేల మంది ఇన్విజిలేటర్లను సిద్ధం చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని, ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయన్న ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం కాలేజీలకు వెళ్లే పని లేకుండా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచారు.
ఎన్నో వాయిదాల తర్వాత తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జేఈఈ మెయిన్ తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. అయితే తాజాగా కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Big News Big Debate: విశ్వక్‌సేన్ వివాదం.. Fపదం వాడటంపై విశ్వక్ సేన్ కొత్త భాష్యం..
Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ను వాడేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు..