Indian Railway: భారతీయ రైల్వే నయా రికార్డ్.. సరుకు రవాణాలో 9.5% వృద్ధి నమోదు

భారతీయ రైల్వే(Indian Railway) సరుకు రవాణా మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2021 - 22 సంవత్సరం నుంచి అత్యుత్తమ పనితీరు ప్రదర్శనను కొనసాగించింది. 2021 ఏప్రిల్‌లో భారతీయ రైల్వే...

Indian Railway: భారతీయ రైల్వే నయా రికార్డ్.. సరుకు రవాణాలో 9.5% వృద్ధి నమోదు
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 02, 2022 | 8:19 PM

భారతీయ రైల్వే(Indian Railway) సరుకు రవాణా మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2021 – 22 సంవత్సరం నుంచి అత్యుత్తమ పనితీరు ప్రదర్శనను కొనసాగించింది. 2021 ఏప్రిల్‌లో భారతీయ రైల్వే 111.64 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయగా.. 2022 ఏప్రిల్‌లో 10.5 మిలియన్‌ టన్నుల (9.5% వృద్ధి) పెరుగుదలతో 122.2 మిలియన్‌ టన్నుల సరుకు లోడింగ్‌ సాధించింది. బొగ్గు లోడింగ్‌లో 5.8 మిలియన్‌ టన్నుల పెరుగుదల, ఆహార ధాన్యాల లోడింగ్‌లో 3.3 మిలియన్‌ టన్నుల పెరుగుదల, ఎరువుల లోడింగ్‌లో 1.3 మిలియన్‌ టన్నుల పెరుగుదల ఈ వృద్ధికి దోహదపడ్డాయని రైల్వే అధికారులు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్లు, ఫినిష్డ్‌ స్టీల్‌కు సంబంధించిన ముడిసరుకు మినహా అన్ని వస్తువులు గత సంవత్సరం వృద్ధిని నమోదు చేశాయి. రోజుకు లోడ్‌ అయిన వ్యాగన్ల సంఖ్య కూడా 9.2% వృద్ధి నమోదైంది. భారతీయ రైల్వే గతేడాది ఏప్రిల్‌ నెలలో 60,434 వ్యాగన్ల లోడింగ్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో రోజుకు 66,024 వ్యాగన్లు లోడ్‌ చేసింది.

దేశంలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, బొగ్గు దిగుమతిని తగ్గించడంతో దేశీయ బొగ్గుకు గణనీయమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ అవసరాలను రైల్వేలు గణనీయంగా తీరుస్తున్నాయి. భారతీయ రైల్వే 2021 సెప్టెంబర్‌ నుంచి 2022 మార్చి వరకు బొగ్గు లోడింగ్‌ను 32% అధికంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేయడమే ఇందుకు నిదర్శనం. ఇదే ప్రక్రియను 2022 ఏప్రిల్‌లోనూ కొనసాగిస్తూ భారతీయ రైల్వే బొగ్గు లోడింగ్‌లో వృద్ధి సాధించింది. విద్యుత్‌ కేంద్రాలకు దేశీయ బొగ్గు లోడింగ్‌ ఏప్రిల్‌ 2022లో 18.8% వృద్ధితో గణనీయంగా పెరిగింది.

ఎఫ్‌సీఐ ఆహార ధాన్యాల సేకరణ, గోధుమ ఎగుమతి డిమాండ్‌తో ఏప్రిల్‌లో ఆహార ధాన్యాల లోడింగ్‌ 95% వృద్ధిని నమోదు చేశాయి. అంతేకాక ఎరువుల లోడింగ్‌లో 53% వృద్ధి కనిపించింది. కంటైనర్ల రంగంలో 10% వృద్ధి సాధించగా, దేశీయ కంటైనర్ల రంగంలో 25% కంటే అధికంగా వృద్ధి జరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

కుండీల్లో పెరిగే వామాకుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అంటారు

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?