AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ‘ఎఫ్3’.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

సమ్మర్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు వెంకటేష్, వరుణ్. ఈ ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎఫ్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

F3 Movie: హాట్ సమ్మర్‌లో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న 'ఎఫ్3'.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే
F3
Rajeev Rayala
|

Updated on: May 02, 2022 | 6:43 PM

Share

సమ్మర్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు వెంకటేష్(Venkatesh), వరుణ్(Varun Tej). ఈ ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎఫ్ 3(F3 Movie) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.

అంచనాలు మరింత పెంచడానికి ఎఫ్3 ట్రైలర్ ను విడుదల చేయడానికి రెడీ అయ్యారు చిత్రయూనిట్. మే 9న ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్. రెండు పాటలు, పోస్టర్‌లు మినహా ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ విడుదల చేయనప్పటికీ సినిమా బిగ్ బజ్‌ని క్రియేట్ చేస్తుంది. చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేయడం లేదు. నేరుగా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.ఎఫ్3 ఫన్ రైడ్  ట్రైలర్‌ను చూసేందుకు మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎఫ్3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా వచ్చిన రెండో పాట ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ కూడా అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించి ట్రెండింగ్ లో వుంది. తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు షాక్ ఇచ్చిన లీకర్స్.. సోషల్ మీడియాలో మూవీ ఫైట్ సీన్..

Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్‌

Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..