Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

గత కొద్ది రోజులుగా థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కరోనా సంక్షోభంతో వెల వెలబోయిన థియేటర్లు ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డ్స్ తలపిస్తున్నాయి.

Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2022 | 12:27 PM

గత కొద్ది రోజులుగా థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కరోనా సంక్షోభంతో వెల వెలబోయిన థియేటర్లు ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డ్స్ తలపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇక ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా సైతం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మే నెలల మొదటి వారం మరింత ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. ఈ వారం సైతం మరిన్ని సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా..

జయమ్మ పంచాయతీ.. చాలా కాలం తర్వాత బుల్లితెర యాంకరమ్మ సుమ ఇప్పుడు వెండితెరపై సందడి చేయబోతుంది. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం జయమ్మ పంచాయతీ.. ఈ చిత్రానికి డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరి డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమా పై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇందులో దినేష్, షాలిని జంటగా కనిపించారు.

అశోకవనంలో అర్జున కళ్యాణం.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇందులో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‏గా నటించగా.. డైరెక్టర్ విద్యాసాగర్ తెరకెక్కించారు. 33 ఏళ్ల అర్జున్ పెళ్లి కోసం పడే కష్టాలు.. తెలంగాణ అబ్బాయి గోదావరి జిల్లాలోని ఓ ఊరిలోకి పెళ్లి చూపులకు వెళ్లడం.. అక్కడ ఏలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనేది తెలియాలంటే అశోకవనంలో అర్జున కళ్యాణం చూడాల్సిందే.

భళా తందనాన.. యంగ్ హీరో శ్రీవిష్ణు.. కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమా భళా తందనాన. ఈ చిత్రానికి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు కీలకపాత్రలలో నటించారు.

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా చిన్ని. ఇందులో సెల్వరాఘవన్ కీలకపాత్రలో నటించారు. డైరెక్టర్ అరుణ్ మథేశ్వరం తెరకెక్కించిన ఈ మూవీ మే 6న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్

అమెజాన్ ప్రైమ్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. కన్నడ.. మే 5 ద వైల్డ్స్.. వెబ్ సిరీస్ 2.. మే 6.

నెట్ ఫ్లిక్స్.. రాధేశ్యామ్.. మే 4..హిందీ, థార్.. హిందీ.. మే 6 ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ .. మే 6.

జీ5.. ఝుండ్.. మే 6.

డిస్నీ హాట్ స్టార్. హోమ్ శాంతి .. మే 6. స్టోరీస్ ఆన్ ది నెక్ట్స్ పేజ్.. మే 6.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..

Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..

RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‏కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..