Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన అడ్వకేట్ అరుణ్ కుమార్..
యంగ్ హీరో విశ్వక్ సేన్ పై అడ్వొకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. నిన్న పెట్రోల్ డబ్బాతో అభిమానిని సూసైడ్ చేసుకునేలా
యంగ్ హీరో విశ్వక్ సేన్ పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. నిన్న పెట్రోల్ డబ్బాతో అభిమానిని సూసైడ్ చేసుకునేలా ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కోన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. హీరో విశ్వక్‌సేన్ నటించిన లేటెస్ట్ మూవీ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా మే6న విడుదల కానుంది. ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విశ్వక్‌సేన్ ఫిలింనగర్ రోడ్డులో వెళ్తుంటే ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్‌సేన్‌కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. నేను తట్టుకోలేకపోతున్నా. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ విశ్వక్ కారుకు అడ్డు పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రమోషన్స్ పేరిట న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు అడ్వొకేట్ అరుణ్ కుమార్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..
Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..
RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..