Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‏కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‏కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..
Ananth Sriram
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2022 | 6:43 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్‏కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో మూవీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తిక విషయాలను తెలియజేశారు..

పదిహేడేళ్ళ జర్నీ.. 1295 పాటలు రాశారు, ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది ? నా ప్రయాణం సులువుగానే ప్రారంభమైయింది. పెద్ద సినిమా కష్టాలు పడలేదు. ప్రారంభంలోనే విజయాలు వచ్చేశాయి. ఐతే ఈ విజయాల నిలకడని కొనసాగించడానికి ప్రతి క్షణం శ్రమించాల్సిందే. ఎప్పటికప్పుడు విజయాలు సాధించాలి. పాటకు మించిన పాట ఇస్తేనే ఇక్కడ రచయితగా నిలబడగలం. దీనికి నిదర్శనమే గీత గోవిందం సినిమాలోఇంకేం ఇంకేం పాట. అప్పుడప్పుడే వ్యూస్ లెక్కపెడుతున్న సమయంలో వంద మిలియన్స్ దాటి రికార్డ్ సృష్టించింది. దాన్ని మించిన విజయం మూడేళ్ళ తర్వాత ‘సర్కారు వారి పాట’ కళావతి సాంగ్ తో వచ్చింది.

సర్కారు వారి పాట కథ చెప్పినపుడు మీకు ఎలాంటి ఎక్సయిట్మెంట్ కలిగింది. ? ఈ కథ వినగానే గత ఐదేళ్ళుగా ఇలాంటి కథ రాలేదు , మళ్ళీ ఐదేళ్ళ తర్వాత గానీ ఇలాంటి కథ మహేశ్ బాబు గారికి రాదనపించింది. విలువలుండి, వ్యాపార విలువలు జోడించిన కథ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కథ మహేష్ బాబు గారికి వచ్చింది, ఇలాంటి సినిమాలో భాగమైతే నా భవిష్యత్ కు మంచి పునాది పడుతుందనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.

కళావతి పాట రాసినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించారా ? పాట రాసినప్పుడు విజయం సాదిస్తుందని ఊహిస్తాం కానీ ఇంత స్థాయిలో విజయం సాధిస్తుందని మాత్రం ఊహించలేం. ఎలాంటి ట్యూన్ ప్రేక్షకులికి నచ్చుతుంది. ఎలాంటి సాహిత్యం కావాలి, సౌండ్స్ ఎలా వుండాలి.. ఇలా చర్చలు జరుగుతాయి. అలా బయటికి వచ్చిన పాట అందరికీ నచ్చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది.

సర్కారు వారి పాట నుంచి రాబోయే రెండు పాటలు కూడా కళావతి స్థాయిలో ఆకట్టుకుంటాయా ? స్థాయి చెప్పలేను కానీ రాబోయే రెండు పాటలు మాత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తాయి.

మహేష్ గారితో ఇది ఎన్నో సినిమా ? ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి రాశాను. సర్కారు వారి పాట రెండోది. పరశురాం గారితో సారొచ్చారు,శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం,,. ఇప్పుడు సర్కారు వారి పాట.

దర్శకుడు పరశురాం గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? దర్శకుడు పరశురాం గారి కథలు సాఫ్ట్ అండ్ క్లాస్ గా వుంటాయి. సర్కారు వారి పాట మాత్రం హైవోల్టేజ్ వున్న కథ. ప్రతి సీన్, డైలాగ్, పాట, సీక్వెన్స్ ఇలా అన్నిటితో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

మహేష్ బాబు గారికి ఈ సినిమాలో ఇష్టమైన పాట ? పెన్నీ సాంగ్ మహేష్ బాబుగారికి చాలా ఇష్టం. ఈ కథ ఆయన ఓకే చేయడానికి గల కారణం హీరో పాత్రలో వుండే కొత్తదనం. హీరో క్యారెక్టర్ ని పెన్నీ సాంగ్ లో అద్భుతంగా రావడం వలన ఆయనకి ఇంకా అద్భుతంగా నచ్చింది.

ఈ సినిమాకి మూడు పెద్ద బ్యానర్లు పనిచేశాయి.. ముగ్గురు నిర్మాతలతో పని చేయడం ఎలా అనిపించింది ? ముగ్గురు నిర్మాతలనే భావనే రాలేదు. దర్శకుడి తరపున పరశురాం గారితో పని చేశాను. ప్రొడక్షన్ వైపు నుండి వాళ్ళు ఎంచుకున్న సంధానకర్తతో పని చేశాను. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్.. నిర్మాతలంతా సినిమాపై ప్రేమ వున్న వాళ్ళు. అలాంటి నిర్మాణ సంస్థలతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. కొత్తగా రాస్తున్న సినిమాలు చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ – శంకర్ గారి సినిమా, నాగ చైతన్య థ్యాంక్ యూ చిత్రాలకు రాస్తున్నాను. ఇవి కాకుండా నవదీప్ హీరోగా లవ్ మౌళి, సత్యదేవ్ కృష్ణమ్మ చచిత్రాలకు సింగెల్ కార్డ్ రాస్తున్నాను. అలాగే ఎస్వీ కృష్ణా రెడ్డిగారి సినిమాకి రాస్తున్నాను.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Sarkaru vaari paata: సూపర్‌ స్టార్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. సర్కారు వారి పాట ట్రైలర్‌

వచ్చేస్తోంది..

AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..

Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?

F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ సిద్ధం చేసిన ఎఫ్‌3 టీమ్‌.. పేలనున్న ఫన్‌ బాంబ్‌..