AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..

AHA OTT: డిజిటల్‌ ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ వస్తోంది తొలి తెలుగు ఓటీటీ ఆహా. ఎప్పటికప్పుడు కొంగొత్త ఒరిజినల్స్‌ను అందిస్తూనే మరో వైపు ఇతర భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలను తెలుగులోకి...

AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..
Follow us
Narender Vaitla

|

Updated on: May 01, 2022 | 7:01 PM

AHA OTT: డిజిటల్‌ ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ వస్తోంది తొలి తెలుగు ఓటీటీ ఆహా. ఎప్పటికప్పుడు కొంగొత్త ఒరిజినల్స్‌ను అందిస్తూనే మరో వైపు ఇతర భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాలను తెలుగులోకి అందిస్తూ ప్రేక్షకులకు అందిస్తోంది ఆహా. ఇప్పటికే ఈ ఆహాలో తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు డబ్‌ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన సినిమాను తెలుగు వారికోసం అందిస్తోంది.

ఫాహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘తొందిముతలం ద్రిక్షక్షియమ్‌’ అనే సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. 2017లో మలయాళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా అవార్డుల పంట సైతం పండించిందీ చిత్రం. ఉత్తమ మలయాళ చిత్రంగా నేషనల్‌ అవార్డ్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘ఆహా’లో ‘దొంగాట’ పేరుతో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. మే 6 నుంచి ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో మలయాళ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోగా నటించిన ఫాహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పుష్పలో ఫాజిల్‌ కనిపించింది కొద్ది సేపే అయినప్పటికీ, తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. త్వరలో రానున్న పుష్ప సీక్వెల్‌లో షాజిల్‌ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుదని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: ఫారిన్ రోడ్ల మీద ఫోటోలకు ఫోజులిచ్చిన మెగా డాటర్ నిహారిక

IDBI Bank: కేంద్రం IDBI బ్యాంక్ వాటాలను అమ్మేస్తోందా..! పూర్తి వివరాలు..

IPL 2022: ఔటివ్వలేదని అంపైర్‌పై అలిగిన చాహల్‌.. సూర్యకుమార్‌ ఎలా బుజ్జగించాడో మీరే చూడండి..