IPL 2022: ఔటివ్వలేదని అంపైర్‌పై అలిగిన చాహల్‌.. సూర్యకుమార్‌ ఎలా బుజ్జగించాడో మీరే చూడండి..

RR vs MI: ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం (ఏప్రిల్‌30) రాత్రి ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

IPL 2022: ఔటివ్వలేదని అంపైర్‌పై అలిగిన చాహల్‌.. సూర్యకుమార్‌ ఎలా బుజ్జగించాడో మీరే చూడండి..
Ipl 2022
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2022 | 1:12 PM

RR vs MI: ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం (ఏప్రిల్‌30) రాత్రి ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. తద్వారా టోర్నీలో మొదటి విజయాన్ని రుచి చూసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆతర్వాత ఛేదనకు దిగిన ముంబై 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సూర్యకుమార్‌ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌ ఆడి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సూర్యకుమార్‌, తిలక్‌వర్మ బ్యాటింగ్‌ చేస్తుండగా 8 ఓవర్‌లో స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ బంతి అందుకున్నాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ స్వీప్‌షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా మిస్‌ అయింది. బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. దీంతో చహల్‌ గట్టిగా ఔట్‌ అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. దీంతో చాహల్‌ డీఆర్‌ఎస్‌ కు వెళ్లాడు. రిప్లేలోనూ బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్‌ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో థర్డ్‌​అంపైర్‌ కూడా నాటౌట్‌ ప్రకటించాడు.

కాగా థర్డ్‌​ అంపైర్‌ నిర్ణయంతో షాక్‌ తిన్నాడు చాహల్‌. ఎంతో నిరాశకు గురయ్యాడు. ఫీల్డ్‌ అంపైర్‌ను తదేకంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ వచ్చి చహల్‌కు హగ్‌ ఇచ్చాడు. ‘ఈసారికి పోనీలే.. మరోసారి ప్రయత్నించు’ అంటూ ఓదార్చాడు. దీంతో తన ఫీల్డింగ్‌ స్థానానికి వెళ్లిపోయాడు చాహల్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సూర్యచెప్పిన మాటలను నిజం చేస్తూ 15 ఓవర్‌లో అతనిని పెవిలియన్‌కు పంపించాడీ స్పిన్‌ బౌలర్‌. ఈమ్యాచ్‌ మొత్తం మీద 4 ఓవర్లు వేసిన యుజువేంద్ర 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఇక ఈ సీజన్‌లో అతను బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతను 19 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్‌ క్యాప్‌ రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే పడి పడి నవ్వాల్సిందే..

IPL 2022: రెండు పరుగులకే రోహిత్‌ ఔట్‌.. నిరాశలో మునిగిపోయిన సతీమణి రితిక.. అశ్విన్‌ భార్య ఎలా ఓదార్చిందో మీరే చూడండి..

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!