Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి మంజిమా మోహన్‌(Manjima Mohan).

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..
Manjima Mohan
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2022 | 11:29 AM

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి మంజిమా మోహన్‌(Manjima Mohan). ఇందులో చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కొన్నిరోజుల క్రితం విష్ణు విశాల్‌ ఎఫ్‌ఐఆర్‌ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ మధ్యన కోలీవుడ్‌ స్టార్‌ గౌతమ్ కార్తిక్ (Gautham Karthik)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు రావడం, వాటిని ఆమె ఖండించడంతో వార్తల్లో నిలిచిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల ఉందని స్పష్టం చేసింది. కాగా మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న మంజిమా ప్రస్తుతం తలైవి డైరెక్టర్‌ ఏ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కించే ఓ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ మధ్య ఆమె కాస్త బొద్దుగా మారిపోయింది. ఈక్రమంలో తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసినప్పుడు కొందరు నెటిజన్లు తన శరీరాకృతిపై బాడీషేమింగ్‌ (Body Shaming) కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించిన ఆమె నెగెటివ్‌ కామెంట్లు చేస్తోన్న నెటిజన్లకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

అలాంటి కామెంట్లు చేయద్దు..

‘ప్రతి ఒక్కరూ హెల్దీగా, ఫిట్‌గా ఉండాలనే అనుకుంటారు. అయితే కొందరు సహజసిద్ధంగానే లావుగా ఉంటారు. ఈ విషయంలో వారిని ఏ మాత్రం తప్పుపట్టలేం. అందువల్ల దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్‌ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అలాంటి కామెంట్లు చేయడం వల్ల బొద్దుగా ఉన్నవారు స్లిమ్‌గా మారిపోతారా? పైగా ఇలాంటి నెగెటివ్‌ కామెంట్ల వల్ల వారిలోని ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. శరీర బరువు పెరగడం, తగ్గడం అనేది వారివారి వ్యక్తిగత ఆరోగ్య లక్షణాలను బట్టి ఉంటుంది. దయచేసి ఈ విషయంలో ఏ ఒక్కరినీ హేళన చేయవద్దు. అవమాన పర్చవద్దు’ అని మంజిమా కోరింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Fact Check: బొత్స కరెంట్ బిల్లులపై నెట్టింట్లో వైరలవుతోన్న ట్వీట్‌.. వివరణ ఇచ్చిన సీఎండీ..

Telangana Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. రేపటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల దరఖాస్తుల స్వీకరణ.. ఎలా అప్లై చేయాలంటే..

Virat Kohli: కింగ్ కోహ్లీ అర్ధసెంచరీ.. గ్యాలరీలో అనుష్క సంబరాలు మాములుగా లేవుగా..