AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. రేపటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల దరఖాస్తుల స్వీకరణ.. ఎలా అప్లై చేయాలంటే..

TSPSC Group 1 Notification 2022: రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగాల భర్తీలో భాగంగా గ్రూప్‌-1, పోలీస్‌, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది.

Telangana Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. రేపటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల దరఖాస్తుల స్వీకరణ.. ఎలా అప్లై చేయాలంటే..
Tspsc Group 1
Basha Shek
|

Updated on: May 01, 2022 | 9:18 AM

Share

TSPSC Group 1 Notification 2022: రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది.  ఉద్యోగాల భర్తీలో భాగంగా  గ్రూప్‌-1, పోలీస్‌, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది. కాగా వీటికి సోమవారం (మే2) నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది. గ్రూప్‌-1 పోస్టులకు మే 2 నుంచి 31 వరకు, పోలీసు, ఇతర యూనిఫాం పోస్టులకు మే 2 నుంచి 20 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) , పోలీస్‌ నియామక బోర్డు (TSLPRB) లు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈక్రమంలో సోమవారం ఉదయం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల లింకులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే నోటిఫికెషన్లలో పూర్తిగా స్పష్టత ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు గానూ ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌లో సవరణ చేసుకున్న, కొత్తగా నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులని కమిషన్‌ స్పష్టం చేసింది.

గ్రూప్‌-1 పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయండిలా..

* 503 గ్రూప్‌-1 పోస్టులకు గాను అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో రేపటి నుంచి లింకు అందుబాటులో ఉంటుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం సవరణ చేసిన, కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఓటీఆర్‌ డేటాబేస్‌లో అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యూనిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవేనని నిర్ధారించుకున్నాక ‘కన్ఫర్మ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయని భావిస్తే ‘నో’పై క్లిక్‌ చేయాలి. దీంతో ఓటీఆర్‌ విండో తెరుచుకుంటుంది. అందులో సంబంధిత వివరాలు నమోదు చేసి, సబ్మిట్‌ చేస్తే తిరిగి అప్లికేషన్‌ వస్తుంది. ఆ తర్వాత ‘కన్ఫర్మ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* ఇక ఓటీఆర్‌ వివరాలకు అదనంగా నోటిఫికేషన్‌ ప్రకారం విద్యార్హతలు, ప్రాధాన్యక్రమంలో పరీక్ష కేంద్రాల నమోదు.. విద్యార్హతలు, వయోపరిమితి ఆధారంగా పోస్టుల ప్రాధాన్యం తదితర వివరాలు పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును ‘సేవ్‌’ చేసి, ‘కన్ఫర్మ్‌’పై క్లిక్‌ చేయాలి. ఈ ప్రక్రియ అనంతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

*అభ్యర్థులందరూ తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెస్‌ రుసుము రూ.200, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మినహాయింపు ఇచ్చింది. 18- 44 ఏళ్లలోపు నిరుద్యోగ అభ్యర్థులూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వారంతా నిరుద్యోగులమంటూ డిక్లరేషన్‌ పత్రం సమర్పించాలి. కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లేదని కమిషన్‌ స్పష్టం చేసింది.

* అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెస్‌ రుసుము, పరీక్ష ఫీజులను నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, టీ వ్యాలెట్‌ ద్వారా చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన అనంతరం దరఖాస్తు పీడీఎఫ్‌ కాపీని భద్రపరచుకోవాలి.

* ప్రిలిమినరీ పరీక్షల కోసం ప్రతి అభ్యర్థి 12 జిల్లా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలుంటాయి. పరీక్ష కేంద్రాల కేటాయింపు అధికారం కమిషన్‌కు మాత్రమే ఉంటుంది. ఒకసారి కేటాయించిన తరువాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు.

*ఇక పోలీస్‌, ఎస్పీఎఫ్‌, ఫైర్‌, జైల్‌, ఎక్సైజ్‌, రవాణా శాఖల్లోని ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి( TSLPRB) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న జారీ అయిన నాలుగు నోటిఫికేషన్లతోపాటు 28న జారీ అయిన రెండు నోటిఫికేషన్లకు సంబంధించి మే 2 ఉదయం 8 గంటల నుంచి మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* మరిన్ని వివరాల కోసం టీఎస్పీఎస్సీ అధికారిక  వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

KGF Chapter2: సలాం రాకీ భాయ్‌ అంటోన్న యశ్‌ గారాల పట్టి.. నెట్టింట్లో వైరలవుతోన్న క్యూట్‌ వీడియో..

Virat Kohli: కింగ్ కోహ్లీ అర్ధసెంచరీ.. గ్యాలరీలో అనుష్క సంబరాలు మాములుగా లేవుగా..

Viral Photo: బుంగమూతి పెట్టుకున్న ఈ బంతిపువ్వు ఎవరో తెలుసా..? కనిపెట్టడం అంత కష్టం కాదేమో..