PNB Recruitment: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..

PNB Recruitment 2022: పంజాబ్‌ నేషన్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

PNB Recruitment: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..
Pnb
Follow us
Narender Vaitla

|

Updated on: May 01, 2022 | 3:28 PM

PNB Recruitment 2022: పంజాబ్‌ నేషన్‌ బ్యాంక్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మేనేజర్లు(రిస్క్‌)–40, మేనేజర్లు(క్రెడిట్‌)–100, సీనియర్‌ మేనేజర్లు(ట్రెజరీ)–05 పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సీఏ/సీఎంఏ లేదా కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ(ఫైనాన్స్‌)/తత్సమాన పీజీ డిగ్రీ(ఫైనాన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 07-05-2022 నుంచి ప్రారంభమవుతుండగా, 12-06-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Health Tips: అలివ్‌ ఆయిల్‌లో వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా నుంచి రూ.29, రూ.39, రూ.98, రూ.195, రూ.319 ప్లాన్స్‌.. ఈ ఐదు చౌకైన ప్లాన్ల ప్రయోజనాలు!

Vodafone Idea: వొడాఫోన్‌ ఐడియా నుంచి రూ.29, రూ.39, రూ.98, రూ.195, రూ.319 ప్లాన్స్‌.. ఈ ఐదు చౌకైన ప్లాన్ల ప్రయోజనాలు!