AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs: ఉద్యోగాల వేట మానేసిన లక్షల మంది భారతీయులు.. కారణాలు అవేనట..

Jobs: సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) తాజాగా విడుదల చేసిన డేటాలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వారి డేటా ప్రకారం దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న జనాభా ఉద్యోగాల కోసం వెతకటం మానేసినట్లు తేలింది. ఎందుకంటే..

Jobs: ఉద్యోగాల వేట మానేసిన లక్షల మంది భారతీయులు.. కారణాలు అవేనట..
Job Search
Ayyappa Mamidi
|

Updated on: May 01, 2022 | 7:04 PM

Share

Jobs: సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) తాజాగా విడుదల చేసిన డేటాలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వారి డేటా ప్రకారం దేశంలో పనిచేసే వయస్సులో ఉన్న జనాభాలో సగానికి పైగా ప్రజలు ఉపాధి కోసం కొత్తగా పని వెలతకటం మానేశారని తేలింది. అసలు దీని వెనుకు ఉన్న కారణాలను ఒక్కసారి పరిశీలిద్దాం.. తగ్గుతున్న వేతన రేట్లు(Low Wage Rates), ఆదాయ స్థాయిలు(Income levels), కార్మికులను లేబర్ మార్కెట్‌లో ఉండకుండా నిరుత్సాహపరుస్తున్నాయని తెలుస్తోంది. తాత్కాలిక కాంట్రాక్టులైజేషన్, భారతదేశ శ్రామిక శక్తి  డీ-యూనియనైజేషన్ కావటం కూడా ఉద్యోగాల్లో నాణ్యత తగ్గటానికి దారితీసిందని తెలుస్తోంది. అంతేకాకుండా.. బలహీనమైన పని ఒప్పందాలు కార్మికులను దోపిడీకి గురిచేస్తూనే ఉన్నాయి. దీంతో చాలా మంది సొంతంగా వ్యాపారాలు చేయాలని ఆలోనచనలోకి వస్తున్నారు. వేరొకరి కింద పనిచేయటం ఇక మానేయాలని యోచిస్తున్నారు.

2020 నాటికి దేశంలోని ఆర్గనైజ్డ్ వర్క్‌ఫోర్స్‌లో 43% కంటే తక్కువ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ కవరేజ్, గ్రాట్యుటీ, హెల్త్‌కేర్, మెటర్నిటీ బెనిఫిట్స్ వంటి ప్రాథమిక సామాజిక భద్రతకు హామీలను అందిస్తున్నాయి. 2019-20 డేటా ప్రకారం.. కేవలం 40% సాధారణ వేతన కార్మికులు మాత్రమే పైన చెప్పిన వాటిలో కనీసం ఒక్క సామాజిక భద్రతా ప్రయోజనాన్నైనా కలిగి ఉన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా.. చాలా మంది భారతీయ కార్మికులు శ్రామిక శక్తి నుంచి నిష్క్రమించడానికి లేదా ‘స్వయం-ఉపాధి’ వైపుకు మారాలని ఎంచుకుంటున్నారు. ఇది జీతాలు అందుకుంటున్న కార్మికుల కంటే ఎక్కువ మంది వ్యాపారాలు నెలకొల్పే వ్యవస్థాపకులకు దారి తీస్తోంది.

దేశంలో 250కి పైగా కెరీర్ ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ.., చాలామంది భారతీయ విద్యార్థుల్లో వారి భవిష్యత్ కెరీర్ ఎంపికల గురించి అవగాహన లేదు. దేశంలోని విద్యార్థుల్లో ఎక్కువ మందికి కేవలం ఏడు కెరీర్ మార్గాల గురించి మాత్రమే తెలుసని రిసెర్చ్ డేటా ప్రకారం తెలుస్తోంది. మహిళలు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి, వారి కుటుంబాలను “ప్రాథమిక బాధ్యత”గా భావించాలని ఇంట్లోని వారు ఒత్తిడి చేస్తుంటారు. కాబట్టి ఉద్యోగాల విషయంలో ఇది కూడా కీలకంగా మారుతోంది. శ్రామిక వయస్సు జనాభాలో అగ్రభాగం ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంచుకుంటున్నారని, అందువల్ల వారు పనిచేయాలని కోరుకోకపోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. చివరగా పనిపట్ల అవిశ్వాసం అయిష్టతకు దారితీస్తోంది. ఇప్పటికే కష్టతరమైన లేబర్ మార్కెట్‌లో ఇలాంటి అనేక కారణాల వల్ల ఇతర ఉద్యోగులు కూడా ఉద్యోగాన్ని, ఉపాధిని వెతుక్కోవటానికి డీమోటివేట్ అవుతున్నారు.

ఇవీ చదవండి..

Gmail Security: జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానమా.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..

WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..