Gmail Security: జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానమా.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..
Gmail Security: ప్రస్తుతం జీమెయిల్ ఖాతాతో గూగుల్ (Google) అందించే ఇతర సేవలనూ యూజర్స్ పొందొచ్చు. అయితే ఈ క్రమంలోనే సైబర్ దాడులు జరుగుతున్నాయి.
Gmail Security: ప్రస్తుతం జీమెయిల్ ఖాతాతో గూగుల్ (Google) అందించే ఇతర సేవలనూ యూజర్స్ పొందొచ్చు. అయితే ఈ క్రమంలోనే సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఒక వేళ మీ జీమెయిల్ ఎకౌంట్ హ్యక్ అయితే మీకు సంబంధించిన ముఖ్యమైన బ్యాంకింగ్, ఆర్థిక, వ్యాపార, వ్యక్తిగత సంభాషణలకు సంబంధించిన గోప్యమైన సమాచారం ఇతరులకు చేరుతుంది. జీమెయిల్ ఖాతా హ్యా క్ అయితే సైబర్ నేరగాళ్లు ముందుగా పాస్వర్డ్, రికవరీ ఫోన్ నంబర్(Phone Number) వంటి కీలకమైన వివరాలను మారుస్తారని గూగుల్ చెబుతోంది. ఖాతా హ్యాక్ అయిందనే అనుమానం రాగానే చేయాల్సిన మొదటి పని ఏమిటంటే.. మీ జీమెయిల్లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీరు లాగిన్ కాలేకపోతే ఖాతా హ్యా క్ అయినట్లు గ్రహించాలి. మీ ఖాతాను తిరిగి పొందేందుకు జీమెయిల్ లోని అకౌంట్ రికవరీ పేజీలోకి వెళ్లాలి. తర్వాత అందులో అడిగే కొన్ని భద్రతాపరమైన ప్రశ్నలకు వినియోగదారులు సమాధానాలు ఇవ్వాలి. దీనికోసం మీరు తరచుగా ఉపయోగించే కంప్యూటర్, బ్రౌజర్‌ను వాడటం ఉత్తమమని గూగుల్ సూచిస్తోంది.
జీమెయిల్ ఖాతా హ్యా క్ అయ్యిందని ఎలా గుర్తించాలి?
ఒకవేళ ఖాతా హ్యా క్ అయితే ఏం చేయాలి? అసలు హ్యాక్ అయిందో లేదో ఎలా గుర్తించాలో ఇప్పు డు తెలుసుకోండి.. మీ ఖాతాను ఎప్పు డు, ఎక్క డ ఉపయోగించారో తెలుసుకునేందుకు గూగుల్ ఖాతాలోకి వెళ్లి ఎడమవైపు మెనూలో సెక్యూ రిటీ సెక్షన్ పైన క్లిక్ చేయాలి. అందులో రీసెంట్ సెక్యూరిటీ యాక్టివిటీ (Recent Security Activity) ప్యా నెల్ ఓపెన్ చేస్తే.. అక్కడ మీ ఖాతాలోకి ఎవరైనా లాగిన్ చేస్తే ఆ వివరాలను చూపిస్తుంది.
రీసెంట్ యాక్టివిటీ చూపించిన డివైజ్ మీది కాకపోతే.. మీరు వెంటనే నో (No) ఆప్షన్ సెలెక్ట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న సూచనలను పాటించినట్లయితే మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఒకవేళ సెక్యూరిటీలో చూపించిన డివైజ్ లాగిన్ వివరాలు మీరు చేసినవే అయితే యెస్ (Yes) అని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ జీమెయిల్ ఖాతాకు ఏయే డివైజ్ లు లింక్ చేసి ఉన్నాయనేది తెలుసుకునేందుకు సెక్యూ రిటీ సెక్షన్లో యువర్ డివైజెస్ (Your Devices) ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుడు దానిపై క్లిక్ చేస్తే మీ జీమెయిల్ ఖాతా లాగిన్ అయిన డివైజ్ ల వివరాలు కనిపిస్తాయి. ఆ జాబితాలో మీరు ఉపయోగిం చే డివైజ్ లేకపోతే డోంట్ రికగ్నైజ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి స్క్రీన్ మీద కనిపించే సూచనలు పాటించాలి. ఇంకా.. మీ జీమెయిల్ ఖాతా భద్రతపై అనుమానం ఉన్నట్లయితే వెంటనే మీ అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోమని ఆటోమెటిక్ గా గూగుల్ సూచిస్తుంది. ఇలాంటప్పుడు మీరు తేలికగా ఉండే పాస్వర్డ్ కాకుండా భిన్నంగా సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్లను వినియోగించి సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవచ్చు.
ఇవీ చదవండి..
WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..