Tata Motors: టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 30 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 500 కి.మీ మైలేజీ

Tata Motors: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చేస్తున్నాయి. వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు...

Tata Motors: టాటా మోటార్స్‌ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 30 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 500 కి.మీ మైలేజీ
Tata Motors Avinya
Follow us
Subhash Goud

|

Updated on: May 01, 2022 | 1:27 PM

Tata Motors: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చేస్తున్నాయి. వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టాటా మోటార్స్‌ తన సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు ‘అవిన్యా’ (Avinya)ను ఆవిష్కరించింది. అవిన్యా పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ (Electric SUV)ని తీసుకొస్తున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. ఈ అవిన్యా ఎలక్ట్రిక్‌ కారు అదరగొడుతోంది. స్మార్ట్ లుక్‌లో దర్శనమిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కారు 2025 నాటికి మార్కెట్లో తీసుకువస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. సరికొత్త ప్యూర్ ఈవీ థర్డ్ జనరేషన్ ఆర్కిటెక్చర్‌ను ఆధారంగా చేసుకుని Tata Avinya రూపొందిస్తున్నట్లు తెలిపింది.

కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌ ఛార్జింగ్‌:

ఈ కొత్తతరం కారు కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవుతుందని, ఆల్ట్రా ఫాస్ట్‌ ఛార్జ్‌ సామర్థ్యానికి సపోర్టు ఇచ్చేలా ఈ కారు బ్యాటరీ ఉంటుదని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా 30 నిమిషాల ఛార్జింగ్‌కి కనీసం 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని టాటా మోటార్స్‌ పేర్కొంది. ఈ కారుకు ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైట్లను టీ ఆకారంలో అందిస్తోంది కంపెనీ ముందు వైపు పెద్ద బ్లాక్ ప్యానల్ ఉంటుంది.

భారతీయ రోడ్లకు అనుగుణంగా కారు తయారీ:

ఈ ఎలక్ట్రిక్‌ కారును భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. సేఫ్టీ, సెక్యూరిటీలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అత్యంత శక్తివంతమైనదని, ఇందులో డస్ట్ ప్రొటెక్షన్ కోసం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ కూడా రూపొందించినట్లు తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

No Cost EMI: నో కాస్ట్‌ ఈఎంఐ అంటే ఏమిటి..? దీని వల్ల ప్రయోజనం ఏమిటి..? ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారు గుర్తించుకోవాల్సిన విషయాలు

SSY Account Transfer: సుకన్య సమృద్ధి ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడం ఎలా?