GST Collections: దేశంలో జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు వసూళ్లు.. ఏప్రిల్ 2022లో రూ.1.68 లక్షల కోట్లు కలెక్షన్..

GST Collections: దేశంలో జీఎస్టీ వసూళ్లు మరో సారి రికార్డు స్థాయిలో(Record GST collections) నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈ సారి వసూళ్లు జరిగాయి.

GST Collections: దేశంలో జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు వసూళ్లు.. ఏప్రిల్ 2022లో రూ.1.68 లక్షల కోట్లు కలెక్షన్..
Gst Record Collections
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 01, 2022 | 4:44 PM

GST Collections: దేశంలో జీఎస్టీ వసూళ్లు మరో సారి రికార్డు స్థాయిలో(Record GST collections) నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈ సారి వసూళ్లు జరిగాయి. 2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు సేవల పన్ను వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ(Union Finance Ministry) ప్రకటించింది. జీఎస్టీ వసూళ్లలో ఇది జీవితకాల గరిష్ఠమని కేంద్రం తెలియజేసింది. ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత రికార్డు వసూళ్ల తరువాత మార్చి నెల కలెక్షన్లు రెండో అత్యధికంగా ఉన్నాయి. మార్చితో పోలిస్తే ఏప్రిల్​లో.. రూ.25 వేల కోట్లు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని కేంద్రం వివరించింది. 2021 ఏప్రిల్​లో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని స్పష్టం చేసింది.

ఏప్రిల్​లో వసూలైన మెుత్తం రూ.1,67,540 కోట్లలో.. సీజీఎస్టీ వసూళ్లు రూ.33,159 కోట్లు, ఎస్​జీఎస్టీ వసూళ్లు రూ.41,793 కోట్లుగా ఉన్నాయి. సమీకృత జీఎస్టీ కింద రూ.81,939 కోట్లు ఉండగా ఇందులో.. వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 36,705 కోట్లు కలిపిన తరువాత విలువ ఇది. సెస్ రూపంలో రూ.10,649 కోట్లు వసూలు జరగగా.. వీటిలో దిగుమతుల నుంచి వసూలు చేసిన రూ.857 కోట్లు కూడా కలిపిన విలువ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. సకాలంలో టాక్స్ చెల్లింపులు చేసేలా, రిటర్నులు సమర్పించేలా అధికారులు చేపట్టిన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని వారు తెలిపారు. జీఎస్టీ చెల్లింపులు దారులు సులువుగా రిటర్నులను దాఖలు చేసేందుకు తీసుకున్న చర్యులు కూడా ఇందుకు దోహదపడినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను వినియోగించి పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Gst రికార్డు వసూళ్లు..

Gst రికార్డు వసూళ్లు..

ఈ ఏడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 1.42 లక్షల కోట్లుగా నమోదు కాగా.. ఇందులో కేంద్ర జీఎస్టీ కింద రూ.25.830 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద రూ.32,378 కోట్లు, సమీకృత జీఎస్టీ కింద రూ.74,470 కోట్లు వసూలయ్యాయి. వాటిలో దిగుమతుల నుంచి వసూలు చేసిన పన్నును కూడా కలిపి లెక్కించారు. సెస్​ కింద రూ.9,417 కోట్లు వసూలయ్యాయి. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులను దాఖలు చేసేలా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో పలు చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులు మెల్లగా గాడిన పడటం, ఇతర చర్యల కారణంగా వసూళ్లు రికార్డు స్థాయిలో జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితాలు కరోనా తరువాత ఆర్థిక పరిస్థితులు కుదుటపడటాన్ని సూచిస్తున్నాయని వారు అంటున్నారు.

ఇవీ చదవండి..

Andhra Pradesh: తస్మాత్ జాగ్రత్త.. నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి.. కోట్లు ఆస్తి కొట్టేశారు..

Multibagger Stock: లక్ష పెట్టుబడిని రూ.10 కోట్లుగా మార్చిన బంపర్ స్టాక్.. మీరు కొన్నారా..