AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: లక్ష పెట్టుబడిని రూ.10 కోట్లుగా మార్చిన బంపర్ స్టాక్.. మీరు కొన్నారా..

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది కొంత రిస్క్ తో కూడుకున్న అంశమే. కొన్ని కంపెనీల షేర్లు అధిక రిటర్న్స్ ఇస్తే.. మరికొన్ని మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలను మిగుల్చుతాయి.

Multibagger Stock: లక్ష పెట్టుబడిని రూ.10 కోట్లుగా మార్చిన బంపర్ స్టాక్.. మీరు కొన్నారా..
Multibagger Stock
Ayyappa Mamidi
|

Updated on: May 01, 2022 | 3:36 PM

Share

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది కొంత రిస్క్ తో కూడుకున్న అంశమే. కొన్ని కంపెనీల షేర్లు అధిక రిటర్న్స్ ఇస్తే.. మరికొన్ని మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలను మిగుల్చుతాయి. కొన్ని మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్(Penny stocks) మాత్రం సామాన్యులను అనతి కాలంలోనే కోటీశ్వరులను చేస్తుంటాయి. ఇన్వెసర్ల అంచనాలకు మించి ర్యాలీ చేసి వాళ్లను ధనవంతులను చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే హావెల్స్ ఇండియా(Havells India) కంపెనీ స్టాక్. ఇది ఏకంగా 10000 శాతం రాబడిని అందించింది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ పరికరాల తయారీలో దేశంలో ఒక అగ్రగామిగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.

ఈ కంపెనీలో ఎవరైన ఇన్వెస్టర్ లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టినట్లయితే ఇప్పుడు దాని విలువ  ఏకంగా రూ. 10 కోట్లై ఉండేది. గత కొన్నేళ్లుగా హావెల్స్ స్టాక్ స్లోపీ రిటర్న్స్ ఇచ్చింది. పర్సంటేజీలో చెప్పాలంటే.. 10 వేల శాతం రాబడిని ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయింది. ఈ కంపెనీ షేరు విలువ రూ.1.37 నుంచి ఏకంగా రూ.1,317 స్థాయికి పెరిగింది. కంపెనీ షేర్ 52 వారాల గరిష్ఠాన్ని చూసుకున్నట్లయితే అది రూ. 1504 వద్ద ఉండగా.. దీని 52 వారాల కనిష్ఠ ధర రూ. 958గా ఉంది.

మే 2, 2003న BSEలో హావెల్స్ ఇండియా స్టాక్ ధర రూ. 1.37గా ఉంది. 29 ఏప్రిల్ 2022న స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి దాని విలువ రూ.1,311 వద్ద ఉంది. సుమారు 19 సంవత్సరాల్లో ఈ స్టాక్ సుమారు 10000 శాతం రాబడిని ఇచ్చింది. 2003, మే 2న ఒక ఇన్వెస్టర్ షేర్‌లో 50 వేలు పెట్టుబడి పెడితే.. ఈ రోజు దాని విలువ రూ. 5 కోట్లుగా ఉండేది. ఎవరైనా ఇన్వెస్టర్ లక్ష పెట్టుబడి పెడితే.. ఆ మొత్తం విలువ దాదాపు రూ. 10 కోట్లకు చేరుకుని ఊహించని రిటర్న్స్ అందించింది. మార్చి 6, 2009న హావెల్స్ షేర్ BSEలో రూ.10.61 స్థాయిలో ఉండేది. ఆ సమయంలో కూడా మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈ రోజు దాని విలువ 1.25 కోట్లకు చేరుకునేది. గత ఐదేళ్లలోనే ఈ కంపెనీ స్టాక్ దాదాపు 170 శాతం రాబడిని అందించింది. గత ఏడాది కాలంలో 30 శాతం కంటే ఎక్కువనే రాబడిని ఇచ్చింది.

ఇవీ చదవండి..

APSRTC: ఆ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఏడు వేల మందికి ఎలక్ట్రిక్ వాహనాలు..!

IDBI Bank: కేంద్రం IDBI బ్యాంక్ వాటాలను అమ్మేస్తోందా..! పూర్తి వివరాలు..