APSRTC: ఆ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఏడు వేల మందికి ఎలక్ట్రిక్ వాహనాలు..!

APSRTC:  ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ ఒక శుభవార్త చెప్పింది. ఆ రెండు జిల్లాల్లోని ఏడు వేల మంది ఉద్యోగులకు త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని నిర్ణయించింది. పూర్తి వివరాలు..

APSRTC: ఆ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఏడు వేల మందికి ఎలక్ట్రిక్ వాహనాలు..!
Electric Scooter
Follow us

|

Updated on: May 01, 2022 | 3:00 PM

APSRTC:  ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ ఒక శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 7 వేల మంది ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను(e-Scooters) అందించేందుకు సిద్ధమైంది. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించటంలో భాగంగా.. ఆర్టీసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో బస్‌స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను(Charging Stations) కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. సంప్రదాయ ఇంధన వనరుల సంస్థ ఉన్నతాధికారులు ఇటీవల ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి బస్‌స్టేషన్లలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా సోలార్ విద్యుత్‌ను అందిస్తామని, ఉద్యోగులకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ తరుణంలో ఉద్యోగులకు నాణ్యమైన బ్యాటరీ కలిగి నాలుగేళ్ల వారంటీతో కూడిన వాహనాలను అందించేందుకు నెడ్‌క్యాప్ ముందుకొచ్చింది. గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఈ వాహనాలను ఉద్యోగులకు అందిస్తారు. వీటి ధర లక్ష రూపాయలకు పైగా ఉండనుంది.. కానీ, ఇందుకోసం ఎలాంటి ముందస్తు రుసుముచెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. ప్రతి నెల ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ రూ. 2000 లేదా రూ.2500 గా రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగులు తమకు అనుగుణంగా ఉన్న వాయిదా పద్ధతిని ఎంచుకోవచ్చు. అలాగే 24 నుంచి 60 నెలల వరకు చెల్లింపు అవకాశం ఉంది. ఎంపిక చేసుకునే వాహనాన్ని బట్టి దాని వేగం ఆధారపడి ఉంటుంది. కనీసం 40 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగం ఉంటుంది. దేశంలోని టాప్ కంపెనీలతోపాటు ఈవీ రంగంలో అనుభవం ఉన్న సంస్థతో నెడ్‌క్యాప్ ఒప్పందం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులకు వాహనాలను అందించనుంది. దీని ద్వారా ఉద్యోగులకు ఆదా కావటమే కాక ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాల మేరకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని వారు అంటున్నారు.

ఇవీ చదవండి..

Andhra Pradesh: విజయవాడలో డ్రగ్స్ కలకలం.. పార్శిల్ లో నిషేధిత మత్తుపదార్థాలు

IDBI Bank: కేంద్రం IDBI బ్యాంక్ వాటాలను అమ్మేస్తోందా..! పూర్తి వివరాలు..