AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..

WhatsApp Crime: చాలామంది భర్తలు తమ భార్యలపై ఉండే ప్రేమతో ఆమె ఫొటోను వాట్సాప్ డీపీలుగా పెడుతుంటారు. ఇదే కాకుండా అనేక సామాజిక మాధ్యమాల్లో తమ భార్యతో దిగిన ఫొటోలను విచ్చలవిడిగా పెట్టేస్తుంటారు. ఇలాంటి చర్యలతో మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తాజా ఘటన చెబుతోంది.

WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..
Whatsapp
Ayyappa Mamidi
|

Updated on: May 01, 2022 | 5:24 PM

Share

WhatsApp Crime: చాలామంది భర్తలు తమ భార్యలపై ఉండే ప్రేమతో ఆమె ఫొటోను వాట్సాప్ డీపీలుగా(WhatsApp Dp) పెడుతుంటారు. ఇదే కాకుండా అనేక సామాజిక మాధ్యమాల్లో తమ భార్యతో దిగిన ఫొటోలను(Wife Photo) విచ్చలవిడిగా పెట్టేస్తుంటారు. అలా వాటిని ఫేస్ బుక్ కవర్ ఫొటోలుగా, ప్రొఫైల్ పిక్స్ గా పోస్ట్ చేస్తుంటారు. కానీ.. వాటి వల్ల సైబర్ నేరగాళ్ల నుంచి ఉండే ముప్పు తెలియక ఇలా చేస్తుంటారు. సైబర్ కేటుగాళ్లు ఇలాంటి భర్తలను టార్గెట్ చేస్తుంటారని మీకు తెలుసా. తాజాగా.. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఈ తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తనను ఒక అగంతకుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే.. సదరు వ్యక్తి తన భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. ఆ ఫొటోను ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాడు దానిని డౌన్‌లోడ్ చేసి తన మార్ఫింగ్ నైపుణ్యాన్ని బయటకు తెచ్చాడు. ఆమె మాములు ఫొటోను ఓ నగ్న ఫొటోగా మార్చేసి.. బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ఆందోళనకు గురైన సదరు భర్త.. ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ ఫిర్యాదును సైబర్ విభాగానికి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు సైబర్ నేరగాడి ఆటకట్టించేందుకు ప్రయత్నం మెుదలుపెట్టారు. నేరస్తుడి ఐపీ అడ్రస్ తెలుసుకుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వ్యక్తుల వాట్సాప్ డీపీలను సైతం.. సైబర్ నేరగాళ్లు డబ్బు చేసుకునేందుకు ఆసరాగా వాడుకోవటం ఆందోళన కరంగా మారింది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఇందులో మరో కోణం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సదరు భర్తకు బాగా తెలిసిన వారే అతని భార్య ఫొటోను సేవ్ చేసుకుని ఇలా డబ్బు కోసం మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారేమోనన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మహిళలనే కాదు వారి ఫొటోలు కనిపించినా ఆ ఫొటోలను ఇలా మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసే స్థాయికి పరిస్థితి దిగజారింది. అందువల్ల.. ఇంట్లోని మహిళలపై అభిమానంతోనో, ప్రేమతోనో వారి ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టకపోవడమే మంచిదని ఈ కేసు ద్వారా తెలుస్తోంది. ఒకవేళ.. అలా మహిళల ఫొటోను డీపీగా పెట్టుకున్నా సన్నిహితులకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకోవడం మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అందుకు చేయాల్సిందల్లా ఒకటే.. వాట్సాప్‌లోకి వెళ్లి కుడి వైపున కనిపించే మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రైవసీ సెట్టింగ్స్ క్లిక్ చేసి మన వ్యక్తిగత వివరాలు, డీపీ, స్టేటస్ ఎవరికి కనిపించాలో అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వ్యక్తిగత వివరాలను, ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసి సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు పోలీసులు అందరినీ హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి..

GST Collections: దేశంలో జీఎస్టీ ఆల్​టైమ్ రికార్డు వసూళ్లు.. ఏప్రిల్ 2022లో రూ.1.68 లక్షల కోట్లు కలెక్షన్..

Andhra Pradesh: తస్మాత్ జాగ్రత్త.. నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి.. కోట్లు ఆస్తి కొట్టేశారు..