AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mana Uru Mana Badi: జూన్ 1 నుంచి బడి బాట.. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులుః మంత్రి సబితా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది.

Mana Uru Mana Badi: జూన్ 1 నుంచి బడి బాట.. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులుః మంత్రి సబితా
Ministers Sub Committee
Balaraju Goud
|

Updated on: Apr 30, 2022 | 3:20 PM

Share

Mana Uru Mana Badi:  దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని 7 వేల కోట్లు కేటాయించామన్నారు. తొలివిడత 3 వేల స్కూళ్లలో మన ఊరు మన బడి స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. తొలి దశలో భాగంగా 3 వేలకుపైగా స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,900 కోట్లను కేటాయించామన్నారు. పూర్తిగా పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయబోతున్నామన్నారు. ఈ క్రమంలోనే టీచర్స్‌కి ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ భేటీలో మంత్రి కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్‌ విద్య, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, సంబంధిత అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బడి బాట కార్యక్రమాన్ని జూన్ 10 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. జూన్ 12 నుంచి ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని. ఆ రోజు నుంచి స్కూల్స్ పునఃప్రారంభం గ్రాండ్‌గా చేస్తామన్నారు. గ్రౌండ్ ఉన్న స్కూల్స్ కి ప్లేయింగ్ కిట్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే, రాష్ట్రంలోని అయా పాఠశాలల పూర్వ విద్యార్థులు కూడా మన ఊరు మన బడిలో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. జూన్ 10 వరకు స్కూల్స్ డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని వెల్లడించిన మంత్రి.. తొలి దశలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, పేరెంట్స్ తో మీటింగ్ పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌ స్కూళ్లను ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మన ఊరు-మన బడి పథకాన్ని (పట్టణాల్లో మన బస్తి-మన బడి) అమలు చేస్తోంది. దీనిద్వారా రాష్ట్రంలో ఉన్న 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించనున్నారు. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచనున్నారు. తొలి దశలో భాగంగా 3 వేలకుపైగా స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు రూ.3,900 కోట్లను కేటాయించింది.

Read  Also…. PM Modi – SemiconIndia: సెమీకండక్టర్ హబ్‌గా భారత్.. ఆరు నెలల్లోనే పరిశ్రమలకు అనుమతులు