Telangana: తెలంగాణ రాష్ట్రాన్ని తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి హరీష్‌రావు
Telangana: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాం పల్లి రాఘవేంద్ర కాలనీలో గల ..
Telangana: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాం పల్లి రాఘవేంద్ర కాలనీలో గల తలసీమియా సికిల్ సొసైటీలో రెండు రోజుల తలసిమియా సికిల్ సెల్ అనిమియా నిరోధం పై జాతీయ సదస్సు తలసిమియా సికిల్ సెల్ సొసైటీ సభ్యులు నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో 33 రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో మల్టీ స్పెషలిస్ట్ ఆస్పత్రిని నిర్మించడమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. నిత్యం రోగులతో కిటకిటలాడే నాలుగు ప్రధాన ఆసుపత్రులలో 100% బెడ్స్ కెపాసిటీ పెంచడానికి వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందని అన్నారు. తలసీమియా వ్యాధి తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ లో చేర్చడం సంతోషకరమని, ఇలాంటి జాతీయ సదస్సు నిర్వహించిన తలసీమియా సికిల్ సొసైటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. తలసీమియా మేజర్ పిల్లల పుట్టుక నిరోధించడంలో తోడ్పడేందుకు వీలుగా ప్రతి గర్భిణీకి యంటేనటిల్ టెస్ట్ -హెచ్ బి ఏ 2 ను తప్పనిసరి చేస్తూ తలసేమియా సికిల్ సొసైటీ సభ్యులు చేసిన అభ్యర్థనను పరిశీలించి, హైదరాబాద్ లో రెడ్ క్రాస్ సొసైటీ, తలసేమియా సికిల్ సొసైటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మాతా శిశుమరణాల విషయంలో తెలంగాణ రాష్ట్రం తమిళనాడును వెనక్కు నెట్టి దేశంలో మూడో స్థానంలో నిలిచింది. నెంబర్ వన్ గా నిలవడానికి కృషి చేస్తున్నాం. కిడ్నీ, బోన్ మారో, గుండే వంటి అవయవమార్పిడి శస్త్రచికిత్సలు నిమ్స్, ఉస్మానియా, గాంధీలలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయిస్తున్నాము. ఆరోగ్య రంగానికి సీఎం కేసీఆర్ బడ్జెట్ ను డబులు చేశారు. 4.5 శాతం బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయించారు. స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లయినా గత పాలకులు ఒక్క కార్పోరేట్ స్థాయి ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయలేదు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు బ్రిటీష్ వారు, నిజాం పాలకులు కట్టారు. సీఎం కేసీఆర్ నగరానికి నలువైపులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మిస్తున్నారు. ఎల్బీనగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, గచ్చిబౌలి టిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తలసేమియా వ్యాధి నివారణకు ఫోకస్ చేయాలి. తెలంగాణ తలసేమియా రహిత రాష్ట్రంగా, దేశంలో తొల రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తాం. ఈ వ్యాధి నివారణకు మా వంతు కృషి చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ అధ్యక్షులు చంద్రకాంత్ అగర్వాల్, కార్యదర్శి డాక్టర్ సుమన్ జైన్, తో పాటు 23 రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: