Telangana: ఉపాధి హామీ కూలీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వేతనాలు పెంపు

Telangana: ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు తెలంగాణ ప్రభుత్వం (TS Government) శుభవార్త తెలిపింది. ఉపాధి హామీ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రోజు..

Telangana: ఉపాధి హామీ కూలీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వేతనాలు పెంపు
Follow us

|

Updated on: Apr 30, 2022 | 8:21 AM

Telangana: ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు తెలంగాణ ప్రభుత్వం (TS Government) శుభవార్త తెలిపింది. ఉపాధి హామీ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రోజు కూలీ రూ.245 నుంచి రూ.257కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఉపాధి హామీ కూలీల వేతనాలు ( Employment Guarantee Wage) ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ప్రతి ఏడాది వేసవిలో వేతనాలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా కూలీలకు చెల్లించే వేతనాలను పెంచుతూ కేంద్రం గత నెలలోనే ఆదేశాలు ఇచ్చింది. నూతన ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం కనీసం రూ. 10 నుంచి 15 వరకు పెంచాలని సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 12 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన కూలీ రేట్ల ప్రకారం రాష్ట్రంలో రోజుకు సగటున రూ. 257 వేతనాన్ని అందుకోనున్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలో మొత్తం 14 కోట్ల 67 లక్షల పని దినాలను లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 14 కోట్ల 9 లక్షలు పని దినాలు కల్పించారు.

ఇక ప్రస్తుతం ఉపాధి హామీలో హరితహారంతో పాటుగా చిన్న చిన్న నీటి పారుదల పనులు, చెరువుల్లో పూడికలు తీయడం, మొక్కల పెంపకంలో భాగంగా కందకాలు తీయడం, గ్రామీణ ప్రాంతాల్లో రహదార్ల నిర్మాణం వంటి పనుల ద్వారా ఉపాధి కూలీలకు పని కల్పిస్తోంది ప్రభుత్వం. ఉపాధి హామీలో గతంలో సగటున రూ. 10 వరకు పెంచిన ప్రభుత్వం.. ఈసారి మాత్రం రూ.12కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఇదే సమయంలో రోజువారీ కూలీ రూ. 235 ఉండగా, దాన్ని రూ. 245కు పెంచారు. ఈ ఏడాది రూ. 245 నుంచి రూ. 257 కు పెంచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SBI: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు లావాదేవీల సురక్షితం కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక మార్గదర్శకాలు!

Solar Eclipse 2022: నేడు సూర్యగ్రహణం.. చేయాల్సినవి.. చేయకూడని పనులు..!

Latest Articles