Solar Eclipse 2022: నేడు సూర్యగ్రహణం.. చేయాల్సినవి.. చేయకూడని పనులు..!

Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం అంతేకాదు ఇదే రోజున వైశాఖక అమావాస్య కూడా ఏర్పడనుంది. సూర్య గ్రహణాలు చాలా వరకు అమావాస్య రోజునే ఏర్పడుతుంటాయి..

Solar Eclipse 2022: నేడు సూర్యగ్రహణం.. చేయాల్సినవి.. చేయకూడని పనులు..!
Solar Eclipse 2022
Follow us
Subhash Goud

|

Updated on: Apr 30, 2022 | 7:58 AM

Solar Eclipse 2022: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం అంతేకాదు ఇదే రోజున వైశాఖక అమావాస్య కూడా ఏర్పడనుంది. సూర్య గ్రహణాలు చాలా వరకు అమావాస్య రోజునే ఏర్పడుతుంటాయి. కాగా ఈ సూర్య గ్రహణం సమయంలో సూర్యుడు చంద్రునిచే పూర్తిగా కప్పబడి ఉంటాడు. దీంతో సూర్య కిరణాలు భూమిని చేరుకోలేవు. ఇక తొలి సూర్యగ్రహణం ఈ ఏప్రిల్‌ (April) 30, 2022న ఏర్పడనుంది. అయితే భారత్‌ (India)లో కనిపించే తొలి సూర్యగ్రహణానికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. మతపరమైన విశ్వాసాలతో ఇంకొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం ఎక్కడ..? ఏ సమయంలో ఎలా కనిపించనుందనే వివరాలను నాసా వెల్లడించింది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో మూడు రోజుల్లో ఏర్పడనుంది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం. దక్షిణ అమెరికాలోని దక్షిణాధి ప్రజలు, అంటార్కికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు ఏప్రిల్‌ 30న సూర్యాస్తమయానికి కొద్దిముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.

ఇక చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్‌ దేశాలలో అకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యాస్తమయం సమయంలో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే భారతదేశంలో మాత్రం ఈ సూర్యగ్రహణం కనిపించదని నాసా తెలిపింది. దక్షిణ, అమెరికాలోని సౌత్‌ ఈస్టర్న్‌ ప్రాంతాల్లో, దక్షిణ పసిపిక్‌ మహా సముద్ర ప్రాంతాల వాసులకు ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 30న రాత్రి 12:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి రోజు.. అంటే మే 1న ఉదయం 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది.

చంద్రగ్రహణాలు, సూర్య గ్రహణం అశుభమైనవని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందట. కాగా ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు.

సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు..

☛ గ్రహనం సమయంలో ఆహారాలను వంటడం గానీ, తినడం కానీ చేయకూడదు.

☛ గ్రహణాన్ని ఎప్పుడూ కళ్లతో చూడకూడదు. ఏదైనా టెలిస్కోప్‌ వంటి పరికరాల ద్వారా మాత్రమే చూడాలి. లేకపోతే కళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే నాసా ఇలాంటి విషయాలను వెల్లడించింది.

☛ ముఖ్యంగా గ్రహణం సమయంలో నిద్రించడం మంచిది కాదు.

☛ సూర్యగ్రహణానికి ముందు తులసి ఆకులను నీటిలోనూ, ఆహారంలోనూ వేయాలి.

గ్రహణం తర్వాత ఈ పనులు చేయండి..

☛ సూర్యగ్రహణం సమయంలో శివుడి ఏదైనా ఒక మంత్రాన్ని జపించడం మంచిది.

☛ సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఇల్లును శుభ్రపరుచుకోండి. ఈ తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లండి. దీంతో గ్రహణ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చెడు కిరణాల ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

☛ గ్రహణం ముగింపు తర్వాత వెంటనే పుణ్యనదుల్లో తలస్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు జ్యోతిషులు. ఇలా నదుల్లో స్నానాలు చేయడం వీలుకాకపోతే ఇంట్లోనే పవిత్ర నదుల గంగాజలం ఉంటే వాటిని స్నానపు నీటిలో కలిపి స్నానం చేయడం మంచిది.

☛ గ్రహణం ముగిసిన తర్వాత పేదవారికి దానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని జ్యోతిష్కులు చెబుతున్న మాట. అలాగే ఆవులకు పచ్చగడ్డి తినిపించిన పుణ్యమే. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుందట.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి:

Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!

Airplane Windows: విమానం కిటికీలు చతురస్రాకారంలో కాకుండా గుండ్రంగా ఉండటానికి కారణం ఏమిటి?