Airplane Windows: విమానం కిటికీలు చతురస్రాకారంలో కాకుండా గుండ్రంగా ఉండటానికి కారణం ఏమిటి?

Airplane Windows: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారంటే విండో సీట్ అంటే ఇష్టం లేదా.. అయితే ఒక్క విషయం మాత్రం గమనించాలి. అది విమానం కిటికీ. సాధారణంగా విండో చతు..

Subhash Goud

|

Updated on: Apr 27, 2022 | 8:52 AM

Airplane Windows: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారంటే విండో సీట్ అంటే ఇష్టం లేదా.. అయితే ఒక్క విషయం మాత్రం గమనించాలి. అది విమానం కిటికీ. సాధారణంగా విండో చతురస్రాకారంగా ఉంటుంది. కానీ విమానం కిటికీల విషయంలో అలా ఉండదు. ఇది రౌండ్ ఆకారంలో ఏర్పాటు చేస్తారు. ఇలా విండోలు  ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? ఇలా ఉండటం వెనుక భద్రతకు సంబంధించినది.

1 / 5
రీడర్స్ డైజెస్ట్ నివేదిక ప్రకారం.. విమానం కిటికీలు ఎల్లప్పుడూ గుండ్రంగా ఉండవు. 1950లకు ముందు విమానంలోని కిటికీలు చతురస్రాకారంలో ఉండేవి. ఆ యుగంలో ఏరో విమానాలు తక్కువ వేగంతో కదులుతాయి. ఈనాటి కంటే కొంచెం తక్కువగా ప్రయాణించేవి. ఇప్పుడు కిటికీలు గుండ్రంగా ఉంటాయి.

2 / 5
ఇలా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. విల్లీస్ ఓర్లాండో, స్కాట్ చిప్ ఫ్లైట్ కోసం అని ప్రొడక్ట్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ చెప్పారు. మొదటి కారణం విమానం  భద్రతకు సంబంధించినది. విమానం ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాలి పీడనం పెరుగుతుంది. రౌండ్ విండో కారణంగా ఈ గాలి పీడనం దానిలోని ప్రతి భాగంపై సమానంగా వస్తుంది. అలాగే విండోస్‌కు పగుళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

3 / 5
ఆకాశంలో ప్రయాణించే విమానం వెలుపల, లోపల చాలా గాలి ఒత్తిడి ఉంటుంది. గుండ్రని కిటికీల కారణంగా ఫ్లైట్ సమయంలో తరచుగా గాలి పీడనం మారడం వల్ల కిటికీలు దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, విమానం వేగం పెరగడం, ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఈ ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది.

4 / 5
1950 సంవత్సరానికి ముందు విమానాలు తక్కువ వేగంతో నడిచేవి. దాని కారణంగా ఇంధనం ఖరీదైనది. ఖర్చు కూడా ఎక్కువ. విమానంలో ప్రయాణించే ట్రెండ్ పెరగడంతో విమానయాన సంస్థలు ఇంధనం కారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు వేగాన్ని పెంచాయి. వేగం పెరిగినప్పుడు పెరిగిన ఒత్తిడిని తగ్గించడానికి రౌండ్ విండోస్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చదరస్రాకారపు కిటికీల కంటే గుండ్రని కిటికీలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా అన్నింటిని పరిగణలోకి తీసుకుని విమానాలకు ఇలాంటి కిటికీలను అమర్చుతున్నారు.

5 / 5
Follow us