Narender Vaitla |
Updated on: Apr 27, 2022 | 8:14 AM
షావోమీ భారత మార్కెట్లోకి తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 12 ప్రో పేరుతో గతేడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.73 అంగుళాల E5 AMOLED డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అదనంగా అందించారు.
స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు.
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
ఈ ఫోన్‌లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. రూ. 60,000 నుంచి అందుబాటులో ఉంది.