- Telugu News Photo Gallery Spiritual photos Leave these habits immediately otherwise you will never get success in life: Chanakya Niti
Chanakya Niti: ఈ అలవాట్లు వెంటనే మానుకోండి.. లేకపోతే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. దీంతోపాటు మంచి, చెడులకు అనేక అంశాలపై నీతి శాస్త్రంలో బోధించాడు.
Updated on: Apr 27, 2022 | 8:57 AM

ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. దీంతోపాటు మంచి, చెడులకు అనేక అంశాలపై నీతి శాస్త్రంలో బోధించాడు. అయితే.. ఓ మనిషి కొన్ని అలవాట్లను వెంటనే మానుకోవాలని.. లేకపోతే చాలా నష్టాలు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇలా చేయడం వల్ల జీవితంలో విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు.

తప్పుడు సహవాసంలో ఉండకండి: చాణక్యుడి ప్రకారం.. తప్పుడు సహవాసాన్ని వదిలివేయండి. తప్పుడు స్నేహాన్ని విడిచిపెట్టలేని వారు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పుడు సహవాసంలో ఉన్రన వ్యక్తి చెడు పనుల వైపు ఆకర్షితుడవుతాడు. ఈ చెడు అలవాట్లు మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. అలాంటి వ్యక్తికి ఎలాంటి గౌరవం లభించదు.

సోమరితనం మీపై ఆధిపత్యం చేయనివ్వవద్దు: చాణక్య నీతి ప్రకారం సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు. చాలా మంది సోమరితనం కారణంగా జీవితంలో విజయం సాధించలేరు. అలాంటి వ్యక్తులు జీవితంలో ముందుకు సాగడానికి కావాల్సిన అనేక అవకాశాలను కోల్పోతారు. కాబట్టి సోమరితనం మానుకోండి.

ప్రతికూల ఆలోచనను నివారించండి: మీ ఆలోచన మీ చర్యలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతికూల ఆలోచనలతో ఉండే వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి విజయంలో సానుకూలత ప్రత్యేక సహకారాన్ని కలిగిస్తుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ తో పని చేసి జీవితంలో విజయం సాధించండి.

వీటితో పాటు చెడు వ్యసనాలకు బానిస కావొద్దని చాణుక్యుడు తెలిపాడు. దీనివల్ల సరైన గౌరవం దక్కదన్నాడు.





























