Health Tips: లివర్ క్లీన్‌గా ఉండాలంటే.. ఈ హెల్తీ ఫుడ్స్ తప్పక తీసుకోవాల్సిందే.. అవేంటో తెలుసా?
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే పనిని చేస్తుంది. అలాగే ఇది అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, కాలేయాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం.

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం(Liver) ఒకటి. ఇది మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే పనిని చేస్తుంది. అలాగే ఇది అనేక ఇతర పనులకు ఉపయోగపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, కాలేయాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం. మీరు కాలేయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటే, కొన్ని ఆరోగ్యకరమైన వాటిని తినాల్సి ఉంటుంది. ఈ హెల్తీ ఫుడ్స్(Healthy Foods) తీసుకోవడం ద్వారా లివర్ డిటాక్సిఫై(Detox) అవుతుంది. ఈ ఆహారాల గురించి తెలుసుకుందాం.. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు, తాజా పండ్లను ఆహారంలో చేర్చుకోండి. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేసుకోవచ్చు.
రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను క్రమం తప్పకుండా నమలడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన మలినాలను శుభ్రం చేయవచ్చు. అలాగే ఇది అనేక ఇతర సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా లివర్ డిటాక్సిఫై అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది వాపు నుంచి ఉపశమనం పొందడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
బీట్‌రూట్ తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ లోపం తీరుతుంది. అలాగే, కాలేయంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కాలేయంలోని మలినాలను శుభ్రం చేయడానికి పసుపు నీటిని క్రమం తప్పకుండా తాగండి. ఇది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా శరీరంలోని అనేక సమస్యలను అధిగమించవచ్చు. అలాగే, కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోవాలి. tv9తెలుగు వీటిని నిర్ధారించలేదు. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Breast Cancer in Men: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే వెంటనే అలర్ట్ అవ్వండి..!
Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..




