Breast Cancer in Men: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే వెంటనే అలర్ట్ అవ్వండి..!

Breast Cancer in Men: రొమ్ము క్యాన్సర్ అంటే మహిళలకే వస్తుందని అంతా అనుకుంటారు. కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలకే కాదు.. పురుషులకూ వస్తుందని చాలా కొద్ది మందికే తెలుసు.

Breast Cancer in Men: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే వెంటనే అలర్ట్ అవ్వండి..!
Cancer
Follow us

|

Updated on: Apr 29, 2022 | 9:45 PM

Breast Cancer in Men: రొమ్ము క్యాన్సర్ అంటే మహిళలకే వస్తుందని అంతా అనుకుంటారు. కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలకే కాదు.. పురుషులకూ వస్తుందని చాలా కొద్ది మందికే తెలుసు. ఈ విషయం తెలియనివారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, ఈ క్యాన్సర్ స్త్రీలలో కంటే పురుషులలో చాలా తక్కువగానే వస్తుంది. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువయ్యాయయి. రొమ్ము క్యాన్సర్ గురించి పురుషుల్లో అవగాహన లేకపోవడం, శ్రద్ధ వహించకపోవడంతో వ్యాధి తీవ్రత పీక్స్‌లోకి వెళుతోంది. దాంతో సమస్య మరింత జఠిలం అవుతుంది. ఏదైనా వ్యాధి రాకుండా ఉండాలంటే.. మొదటా ఆ వ్యాధి గురించిన అవగాహన తప్పనిసరి. పురుషుల రొమ్ము క్యాన్సర్‌కు కూడా ఇది వర్తిస్తుంది. ఇవాళ మనం పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం..

పురుషులలో రొమ్ము క్యాన్సర్‌కు కారణాలు ఏమిటి? కొన్ని కారణాల వల్ల పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ పీబీ మిశ్రా.. చాలా సందర్భాల్లో జన్యుపరమైన కారణాల వల్లే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు. అంటే, ఎవరి కుటుంబంలోనైనా బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉంటే, వారిలో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో, ఒక వ్యక్తి తన ఛాతీ దగ్గర రేడియేషన్ థెరపీని తీసుకుంటే, అతనిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాకుండా జీవనశైలి సరిగా లేకపోవడం, కొన్ని జన్యుపరమైన రుగ్మతల వల్ల పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.. పురుషులలో చాలా వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. ఛాతీలో గడ్డ ఏర్పడటం (రొమ్ములో చనుమొన దగ్గర). చనుమొనలపై మొటిమల వంటి పుండ్లు. ఉరుగుజ్జులు లోపలికి కదులుతాయి, దద్దుర్లు ఉంటాయి. చనుమొన ఉత్సర్గ, వాపు లేదా దానిలో రక్తం వస్తుంది. అలసట, అనారోగ్యంగా అనిపించడం, కీళ్ల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దురద వంటి సమస్యలు ఏర్పడుతాయి.

లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?.. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపించినా లేదా అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలు కనిపిస్తే రోగికి బయాప్సీ చేస్తారు. ఆ సమయంలో ఛాతీలోని ముద్ద నుండి ఒక చిన్న భాగాన్ని తీసివేసి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపుతారు. పరీక్షల్లో ఈ గడ్డ క్యాన్సర్ వల్ల వచ్చిందా? లేదా? అనేది తేలుస్తారు. అదే సమయంలో రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి మరికొన్ని పరీక్షలు కూడా చేసి క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.

చికిత్స ఎలా?.. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేసినట్లే, పురుషులలో కూడా అదే విధంగా రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేస్తారు. సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌ను 3 మార్గాల్లో చికిత్స చేస్తారు. మొదటి పద్ధతిలో రోగికి ఆపరేషన్ చేయడం ద్వారా క్యాన్సర్ ప్రభావిత గడ్డను ఛాతీ నుండి తొలగించడం. రెండో పద్ధతిలో బాధిత రోగికి కీమోథెరపీ చేయబడుతుంది. ఇందులో క్యాన్సర్ ప్రభావిత కణాలను మందుల ద్వారా నాశనం చేస్తారు. మూడవ చికిత్స రేడియేషన్ థెరపీ. దీనిలో రొమ్ము క్యాన్సర్ చికిత్స అధిక శక్తి గల X- కిరణాలు, గామా- రేడియేషన్ ద్వారా చేస్తారు.

Also read:

Viral Video: వీడ్కోలు సమయంలో బోరున విలపించిన వరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!

Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..

Viral Video: ఆడ పులి కోసం రెండు పులుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే