AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆడ పులి కోసం రెండు పులుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!

Viral Video: ఆడవారితో పెట్టుకుంటే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయనే వాస్తవం మనకు తెలిసిందే. చరిత్ర దాకా ఎందుకు గిన.. ప్రేయసి కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకు..

Viral Video: ఆడ పులి కోసం రెండు పులుల మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదరాల్సిందే..!
Tiger
Shiva Prajapati
|

Updated on: Apr 29, 2022 | 6:33 PM

Share

Viral Video: ఆడవారితో పెట్టుకుంటే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయాయనే వాస్తవం మనకు తెలిసిందే. చరిత్ర దాకా ఎందుకు గిన.. ప్రేయసి కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకు చచ్చిన సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అనేక జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వివాదాలు మనుషులకు పరిమితం కాలేదు. జంతువుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అవును మీరు విన్నది నిజంగా నిజం. ఓ ఆడ పులిని మెప్పించడం కోసం రెండు పులులు పోట్లాడుకున్నాయి. వాటి పోరు చూస్తే గుండెలదిరిపోవాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు జడుసుకుంటున్నారు.

ఈ వైరల్ వీడియోలో కొందరు పర్యాటకులు అడవిలో సఫారీలో పర్యటిస్తూ జంతువులను చూస్తున్నారు. ఇంతలో రోడ్డు మధ్య నుంచి రెండు పలులు కలిసిమెలిసి నడుచుకుంటూ వెళ్తున్నాయి. రోడ్డుకు అవతలి వైపున ఓ ఆడ పులి నిల్చుని ఉంది. దానిని గమనించిన ఈ రెండు పులులు.. ఉన్నట్లుండి గొడవపడ్డాయి. రెండు పులులు తమ పంజాలతో విరుచుకుపడ్డాయి. అత్యంత భీకరంగా పోట్లాడుకున్నాయి. అప్పటి వరకు సన్నిహితంగా ఉన్న పులులు.. ఒక్కసారిగా రౌద్రరూపంతో ఒకదానిపై మరొకటి విరుచుకుపడటం చూసి పర్యాటకులు సైతం హడలిపోయారు. ఇక ఈ రెండు పులులు చాలాసేపు పోట్లాడుకున్న తరువాత ఒక పులి వెనక్కి తగ్గింది. దాంతో ఆ రెండు వేరు వేరు అయ్యాయి. మరోవైపు ఈ రెండు పులులు పోట్లాడుకుంటుంటే.. పక్కనే ఉన్న ఆడ పులి ప్రశాంతంగా తిలకించింది. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా నిల్చుకుని ఆస్వాదించింది.

ఈ భీకర పోరుకు సంబంధించిన వీడియోను ఐఎస్ఎఫ్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు హడలిపోతున్నారు. వీడియోలో చూస్తేనే ఇంత భీకరంగా ఉంది.. నేరుగా చూస్తే సీన్ ఇంక ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 15 వేల మందికిపైగా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Health Tips: ఉదయం లేవగానే భుజాలు బిగుసుకుపోతున్నాయా? ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టండి..!

Wipro Jobs: బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉన్నారా.? విప్రో తెచ్చిన ఈ అవకాశం మీకోసమే..

Indian Railway: అర్థాంతరంగా రద్దవుతున్నాయి.. ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుతున్నాయి.. రైల్వే తీరుతో ప్రయాణికులు సతమతం

నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..
అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు..