Health Tips: ఉదయం లేవగానే భుజాలు బిగుసుకుపోతున్నాయా? ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టండి..!

Health Tips: ఏదైనా పని చేసినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు.. విశ్రాంతి తీసుకోవడానికి మంచం మీద రిలాక్స్ అవుతుంటాం. అయితే, కొన్ని కొన్నిసార్లు పడుకుని లేచిన తరువాత భుజాలు పట్టేస్తుంటాయి.

Health Tips: ఉదయం లేవగానే భుజాలు బిగుసుకుపోతున్నాయా? ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టండి..!
Shoulder Pain
Follow us

|

Updated on: Apr 29, 2022 | 5:17 PM

Health Tips: ఏదైనా పని చేసినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు.. విశ్రాంతి తీసుకోవడానికి మంచం మీద రిలాక్స్ అవుతుంటాం. అయితే, కొన్ని కొన్నిసార్లు పడుకుని లేచిన తరువాత భుజాలు పట్టేస్తుంటాయి. బిగ్గరగా ఉన్నట్లు, నొప్పిగా ఉంటుంది. భుజాలే కాదు.. కాళ్లు, చేతుల కీళ్లు కూడా ఒక్కోసారి పట్టేసినట్లుగా అనిపిస్తుంటాయి. దాని కారణంగా నిద్ర లేచిన తరువాత నడవడం, ఏదైనా పని చేయాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు, పట్టేసినట్లు అనిపస్తున్న భుజం నొప్పి నుంచి విముక్తి పొందేందుకు కొన్ని చిట్కాలను ఇవాళ మనం తెలుసుకుందాం..

భుజం పట్టేసినట్లుగా, బిగుసుకున్నట్లుగా అనిపిస్తే దానిని క్యాప్సులిటిస్ అంటారు. భుజం బాల్ అండ్ సాకెట్ జాయింట్‌ను ఈ క్యాప్సులిటిస్ వ్యాధి ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సకాలంలో దీనికి చికిత్స చేయకపోతే ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇది సాధారణంగా 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు, మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.

క్యాప్సులిటిస్ లక్షణాలివే.. ఈ సమస్యతో బాధపడేవారిలో తీవ్రమైన నొప్పి, భుజం గట్టిపడినట్లుగా అనిపించడం, చేతులను తలపైకి లేపలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇది క్రమంగా చేతుల నుంచి శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. కాగా, ఈ సమస్య మూడు దశలలో వ్యాప్తి చెందుతుంది.

ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే.. 1. లోలకం వ్యాయామం.. ఈ వ్యాయామంలో భాగంగా నడుము వరకు వంగి.. చేతులను ఫ్రీగా కిందకు వదిలేయాలి. ఆపై భుజం కీలు నుంచి చేతిని నెమ్మదిగా కదిలించాలి. కాసేపు వృత్తాకారంలో చేతిని తిప్పాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల భుజం నొప్పి సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

2. టేబుల్‌టాప్ ఆర్మ్ స్లయిడ్.. టేబుల్‌టాప్ దగ్గర కుర్చీలో కూర్చోండి. ఆపై ప్రభావితమైన చేతిని పైకి ఎత్తండి. సమస్య లేని చేతిని కిందకు అలాగే ఉంచాలి. ఆ తరువాత ప్రభావిత చేతిని పైకి లేకి టేబుల్‌పై ఉంచాలి. 5 నుంచి 10 సెకన్ల పాటు ఇలా ఉంచాలి. ప్రతిరోజూ దీనిని చేస్తే ఫలితం ఉంటుంది.

3. వాల్ స్లయిడ్.. గోడకు అభిముఖంగా రెండు అరచేతులను గోడపై ఉంచి, చేతులను పైకి కదిలించాలి. ఇలా 15-20 సెకన్ల పాటు చేస్తూ ఉండాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

4. టవల్ స్ట్రెచ్ ఒక టవల్‌ని చేతిలోకి తీసుకుని.. అది మీ వీపు వెనుక పడేలా చేసి, ప్రభావితమైన చేతిని మెల్లగా వీపు వెనుకకు కదిలించాలి. టవల్‌ను పట్టుకుని నెమ్మదిగా పైకి లాగాలి. ప్రతిరోజూ 1 నిమిషం ఇలా చేస్తే.. నొప్పి నుంచి క్రమంగా ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Telangana: ఎనిమిదో విడత హరితహారం.. ఈ ఏడాది 19 .50 కోట్ల మొక్కలు నాటే దిశగా ప్రణాళికలు

AIIMS Recruitment: న్యూఢిల్లీ ఏయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం..

Kajal Aggarwal: ఆచార్య సినిమాలో లేని కాజల్.. అయినా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ?.. ఎంతంటే..