AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎనిమిదో విడత హరితహారం.. ఈ ఏడాది 19 .50 కోట్ల మొక్కలు నాటే దిశగా ప్రణాళికలు

Telangana: తెలంగాణాలో పర్యావరణ పరిరక్షణ కోసం.. చేపట్టిన హరితహారం(Haritaharam) కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఆకట్టుకుంది. గత కొన్నేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న హరితహారం కార్యక్రమంలో..

Telangana: ఎనిమిదో విడత హరితహారం.. ఈ ఏడాది 19 .50 కోట్ల మొక్కలు నాటే దిశగా ప్రణాళికలు
Ts Haritha Haram
Surya Kala
|

Updated on: Apr 29, 2022 | 4:07 PM

Share

Telangana: తెలంగాణాలో పర్యావరణ పరిరక్షణ కోసం.. చేపట్టిన హరితహారం(Haritaharam) కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఆకట్టుకుంది. గత కొన్నేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎనిమిదవ విడత భారీగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనుంది. ఈ విషయంపై సి.ఎస్. సోమేశ్ కుమార్(CS Somesh Kumar) స్పందిస్తూ.. హరితహారంలో భాగంగా ఈ ఏడాది 19 .50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి వరి ధాన్యం సేకరణ అమలుపై సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఈ సమావేశంలో సోమేశ్ కుమార్  తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయ వంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7 .70 శాతం పెరిగిందన్నారు. అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంపొందించేందుకై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 19,400 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేశామని.. అయితే ఇప్పటి వరకూ ఏర్పాటుచేయని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌చ్చ‌ద‌నం పెంపు కోసం ప్ర‌తీ మున్సిపాలిటీకి ప్ర‌ణాళిక ఉండాల‌ని చెప్పారు. ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించి.. వాటిల్లో మొక్కలు పెంచ‌టం ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌న్నారు. ఎండ‌లు తీవ్రంగా ఉన్నందున హ‌రిత‌హారం మొక్క‌ల‌కు వారంలో రెండు, మూడు సార్లు నీటి వ‌స‌తి క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఇరిగేష‌న్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గ‌ట్లపై ప‌చ్చ‌ద‌నం పెంపు, ప‌ది శాతం క‌న్నా త‌క్కువ అట‌వీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో పచ్చ‌ద‌నం పెంచ‌టం ఎనిమిద‌వ విడ‌త హ‌రిత‌హారం ప్రాధాన్య‌తా అంశాలు అని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ప్ర‌క‌టించారు. ఇందు కోసం వారం రోజుల్లో యాక్ష‌న్ ప్లాన్ ను సిద్దం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

దళిత బంధు అమలును సి.ఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే మంజూరు చేసి లబ్దిదారులను గుర్తించిన దళితబంధు యూనిట్లను వెంటనే గ్రౌండ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు.

వరి ధాన్యం సేకరణ గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే ఏడు కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్లు త్వరలో వస్తాయని ఆయన అన్నారు. అన్ని రైతు వేదికల్లో రైతు సమావేశాలు నిర్వహించి, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. రైతువేదికలను క్రియాత్మకంగా తీర్చిదిద్దాలని ఆయన ఆదేశించారు.

Also Read: AP Weather Alert: ఏపీ వాసులకు అలెర్ట్.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజుపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు..