TS SSC Exams 2022: మే 23 నుంచి ప్రారంభంకానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు.. ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థే..

ఈ ఏడాది జరగనున్న తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బెంచీకి ఒక్కో విద్యార్ధి చొప్పున..

TS SSC Exams 2022: మే 23 నుంచి ప్రారంభంకానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు.. ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థే..
Ts Ssc Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 29, 2022 | 4:07 PM

Telangana 10th Class Exams to begin from May 23rd: ఈ ఏడాది జరగనున్న తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాల్లో కేంద్రాల ఎంపిక పూర్తి చేశారు. పరీక్షకు హాజరయ్యేవారికి ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. వచ్చే నెల (మే) 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏటా 11 పేపర్లు రాయాల్సి ఉండగా కరోనా కారణంగా ఈసారి 6 పేపర్లకు విద్యాశాఖ కుదించింది. సైన్స్‌ సబ్జెక్టులైన (Science Subject) జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పరీక్షలు ఒకేరోజు వేర్వేరుగా జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జిల్లాల్లో 940 కేంద్రాలు ఉండగా.. 1,65,683 మంది విద్యార్థులు రాయనున్నారు. కరోనా నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

కాగా ఈ సారి పరీక్షలకు బెంచీకొకరు చొప్పున విద్యార్థులను ‘Z’ ఆకారంలో కూర్చోబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతి గదికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న గదులైతే 12 మంది.. పెద్ద గదుల్లోనైతే 24 మంది కూర్చునేలా బెంచీలు వేస్తున్నారు. మండుటెండల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కేంద్రాల ఎంపికలో కరెంట్‌ సదుపాయాలు, తాగునీటి సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Also Read:

AP 10th Exams Paper Leak: 3 రోజులుగా లీకౌతున్న టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్లు! నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న విద్యాశాఖ..?