AIIMS Recruitment: న్యూఢిల్లీ ఏయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం..

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లోలోని ఈ సంస్థలో 2022 జులై సెషన్‌కుగాను పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

AIIMS Recruitment: న్యూఢిల్లీ ఏయిమ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 29, 2022 | 3:59 PM

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లోలోని ఈ సంస్థలో 2022 జులై సెషన్‌కుగాను పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్‌ రెసిడెంట్లు/ సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్‌ పోస్టులను భర్త చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అనెస్తీషియాలజీ, పల్లియేటివ్‌ మెడిసిన్‌, ఫార్మకాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, మెడిసిన్‌ ట్రామా, రుమటాలజీ, పీడియాట్రిక్స్‌, ఫోరెన్సిక్‌, మెడిసిన్‌, మెడిసిన్‌, మెడికల్‌ ఫిజిక్స్‌, పల్మనరీ మెడిసిన్, మైక్రోబయాలజీ, కార్డియాలజీ వంటి ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీ, మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థుల వయసు 31-08-2022 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

* జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ. 1200 చెల్లించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 67,700 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 16-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. 11-06-2022న పరీక్షను నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Also Read: Tirumala: తిరుమలలో బ్యాగ్ కలకలం.. ఆందోళనలో భక్తులు

EV fire: ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ ప్రమాదాలపై కేంద్రం ఫోకస్.. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం

Stock Market: వారాంతంలో లాభాల్లో ట్రేడ్ అవుతున్న కీలక సూచీలు.. కీలకంగా కంపెనీల ఫలితాలు..