Stock Market: వారాంతంలో లాభాల్లో ట్రేడ్ అవుతున్న కీలక సూచీలు.. కీలకంగా కంపెనీల ఫలితాలు..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు వారాంతంలో లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఊతమిస్తున్నాయి.

Stock Market: వారాంతంలో లాభాల్లో ట్రేడ్ అవుతున్న కీలక సూచీలు.. కీలకంగా కంపెనీల ఫలితాలు..
Stock Market
Follow us

|

Updated on: Apr 29, 2022 | 11:36 AM

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు వారాంతంలో లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఊతమిస్తున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగియటంతో ఆ ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా విడుదల చేసిన ఆర్థిక ఫలితాలు అక్కడి మార్కెట్ల సూచీలను ముందుకు నడిపించాయి. వీటితో పాటు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా పాజిటివ్ నేట్ లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ అంతర్జాతీయ మార్కెట్లో 105 డాలర్లుగా ఉంది. ఈ పరిణామాల మధ్య ఉదయం 11.15 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 298 పాయింట్ల లాభంతో ఉండగా.., మరో కీలక సూచీ నిఫ్టీ (Nifty-50) 90 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 130 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 145 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతున్నాయి. అనేక కంపెనీల త్రైమాసిక ఫలితాలు నేడు విడుదల కానుండటంతో మార్కెట్లపై ఆ ప్రభావం ఉండనుంది.

ఫలితాలు వెల్లడించనున్న కంపెనీలు..

మారుతీ సుజుకీ ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, విప్రో, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ సర్వీసెస్‌, క్యాన్‌ఫిన్‌ హోమ్స్‌, జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జిల్లెట్‌ ఇండియా, జీఎన్‌ఏ యాక్సిల్స్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, జస్ట్‌ డయల్‌, ఎల్అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, లాయిడ్స్‌ మెటల్స్‌ అండ్‌ ఎనర్జీ, ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌, టాటా కెమికల్స్‌, థైరోకేర్‌ టెక్నాలజీస్‌.

టాప్ గెయినర్ అండ్ లూజర్స్..

జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ లో డాక్టర్ రెడ్డీస్ 3.10%, సన్ ఫార్మా 2.82%, లుపిన్ 2.15%, యస్ బ్యాంక్ 1.83%, భారతీ ఎయిర్ టెల్ 1.70%, గెయిల్ 1.65%, టాటా స్టీల్ 1.60%, వేదాంతా 1.54%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.54%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.47% మేర లాభపడి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో యాక్సిస్ బ్యాంక్ 4.40%, అదానీ పోర్ట్స్ 1.76%, హెచ్పీసీఎల్ 1.75%, విప్రో 1.57%, జీ ఎంటర్టైన్ మెంట్ 1.47%, పవర్ గ్రిడ్ 1.40%, కోల్ ఇండియా 1.13%, టెక్ మహీంద్రా 0.69%, ఇండియన్ ఆయిల్ 0.62%, ఎన్టీపీసీ 0.59% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

EV fire: ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ ప్రమాదాలపై కేంద్రం ఫోకస్.. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం

E-commerce: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లకు ఎదురుదెబ్బ.. ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రభుత్వం..!

Latest Articles
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??
భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??