Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-commerce: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లకు ఎదురుదెబ్బ.. ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రభుత్వం..!

E-commerce: దేశంలో ఆన్ లైన్ వినియోగదారులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ మార్కెట్ విలువ 2021 లెక్కల ప్రకారం రూ. 75 లక్షల కోట్లుగా ఉంది. శరవేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ మార్కెట్ లోకి మరో ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అరంగేట్రం చేస్తోంది.

E-commerce: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లకు ఎదురుదెబ్బ.. ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రభుత్వం..!
Online
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 29, 2022 | 9:50 AM

E-commerce: దేశంలో ఆన్ లైన్ వినియోగదారులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ మార్కెట్ విలువ 2021 లెక్కల ప్రకారం రూ. 75 లక్షల కోట్లుగా ఉంది. శరవేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ మార్కెట్(Retail Market) లోకి మరో ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అరంగేట్రం చేస్తోంది. ఈ సారి వస్తోంది దిగ్గజ పారిశ్రామిక కంపెనీ కాదు.. భారత ప్రభుత్వం దీనిని ప్రారంభిస్తోంది. ఇది లాభాపేక్ష లేనిది కావటం విశేషం. దేశంలో ఆధార్, యూపీఐ(UPI) వ్యవస్థలను తీసుకురావడంలో ప్రభుత్వానికి సహాయం చేసిన నందన్‌ నీలేకనితో పాటు పలువురు ప్రముఖులు ‘ఓపెన్‌ టెక్నాలజీ నెట్‌వర్క్‌’ ఆధారిత ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ రూపకల్పనలోనూ ప్రభుత్వానికి సాయం చేయనున్నారు. దిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌ నగరాల్లో ముందుగా దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రయోగాత్మకంగా దీని అమలును ప్రారంభిస్తోంది. కొంత మంది వినియోగదారులపై దీనిని పరీక్షించనున్నారు. తరువాతి విడతలో ఈ సేవలను 100 నగరాలకు దీని సేవలను విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

దేశీయ ఈ-కామర్స్‌ వ్యాపారంలో సింహభాగమైన 80 శాతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ చేతిలోనే ఉంది. సుమారు 1.80 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు ప్రోత్సాహకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా వీటి నుంచి ఆర్డర్లు చేయటం మరింతగా పెరిగింది. దీంతో కిరణా దుకాణాలు భవిష్యత్తు అనిశ్చితిలో పడుతోందని అంచనా. మొత్తం రిటైల్‌ విపణిలో ఆన్‌లైన్‌ అమ్మకాల విలువ ప్రస్తుతానికి 6 శాతమే ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో ఈ లెక్కలు తారుమారవుతాయని నిపుణులు అంటున్నారు. ప్రధాని మోదీ సూచనతో నీలేకని, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం రంగంలోకి దిగింది. ‘ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌’(ONDC) పెరిట దీనిని అందుబాటులోకి తీసుకొస్తోంది ప్రభుత్వం. ఆకర్షణీయమైన ధరలు, సరకు నిర్వహణలో సమర్థత, సరఫరా వ్యయాలను అదుపులో ఉంచుకోవడంపై ఆధారపడి ఈ వ్యవస్థ రాణిస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే చాలా కంపెనీలు ఓఎన్‌డీసీతో ఒప్పందం చేసుకున్నాయి.

ప్రభుత్వ ఆధ్వర్యంలో, లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. ఈ నమూనాను అర్థం చేసుకోవాల్సి ఉందని.. ఆ తర్వాతే ఏం చేయాలన్నది నిర్ణయిస్తామని అమెజాన్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ విజయవంతమైతే చిన్న వ్యాపారులు సైతం ఆన్‌లైన్‌ పద్ధతిలో  అనేక మందికి తమ ఉత్పత్తులను అమ్మేందుకు మార్గం సుగమమౌతుంది. దేశంలో 80 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఉండటం దీనికి కలిసొచ్చే మరో అంశంగా చెప్పుకోవాలి. దీనిని పైవేటు సంస్థలు ఎలా తట్టుకుంటాయి, ఎలాంటి కొత్త సేవలను కస్టమర్లకు అందిస్తాయి, సేవలను ఎలా మరింతగా మెరుగుపరుచుకుంటాయి అన్న విషయాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. లేక ప్రభుత్వరంగ సంస్థను నీరుగారుస్తారా అన్నది రానున్న కాలంలో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Amazon Prime Videos: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు ముందుగానే యాక్సెస్..

Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లకి మార్కెట్లో మంచి డిమాండ్.. పెరిగిన ఇంధన ధరలకి ప్రత్యామ్నాయం..!