Money Safety Tips: ఇలా చేస్తే మీ పొదుపు ఖాతాల్లో డబ్బులు సేఫ్‌గా ఉన్నట్లే.. ఈ విషయాలు తెలుసుకోండి!

బ్యాంకు ఖాతాల్లో డబ్బులు సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి.? ఆన్‌లైన్ ద్వారా ట్రాన్సక్షన్స్‌ను చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.?

Money Safety Tips: ఇలా చేస్తే మీ పొదుపు ఖాతాల్లో డబ్బులు సేఫ్‌గా ఉన్నట్లే.. ఈ విషయాలు తెలుసుకోండి!
Money
Follow us

|

Updated on: Apr 29, 2022 | 11:12 AM

బ్యాంకు ఖాతాల్లో డబ్బులు సేఫ్‌గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి.? ఆన్‌లైన్ ద్వారా ట్రాన్సక్షన్స్‌ను చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి.? ఈ మధ్యకాలంలో అందరూ ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నారు. అసలే సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో మీ బ్యాంక్ ఖాతాల్లో(Money Tips) డబ్బులు సేఫ్‌గా ఉంచాలంటే పలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే మోసాలు బారిన పడటం ఖాయం.

సింపుల్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవద్దు.. మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఈజీగా ఉంటే, సైబర్ కేటుగాళ్లు మీ ఖాతాను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మీ పేరు లేదా మీ కుటుంబంలోని ఎవరి పేరైనా, మొబైల్ నంబర్, మీ బండి నంబర్ లేదా పుట్టిన సంవత్సరం లేదా పుట్టిన తేదీ.. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ను ఈజీగా గుర్తించవచ్చు. ఉదాహరణలు ఇవ్వాలంటే – password, qwerty, 123456 మొదలైనవి అని చెప్పాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతాలన్నీంటికి కూడా ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం వల్ల సైబర్ కేటుగాళ్లు మీ డబ్బును లూటీ చేసే ప్రమాదం ఉంది.

వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.. ఇతరులతో పాస్‌వర్డ్ షేర్ చేసినంత మాత్రాన ఖాతాలోని డబ్బు లూటీ అవుతుందా.? అని మీరు అనుకోవచ్చు.. అదొకటి మాత్రమే కాదు.. మీ వ్యక్తిగత వివరాలు, ఐడీ లాంటివి తెలియని వ్యక్తులతో పంచుకున్నా.. మీ బ్యాంక్ ఖాతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీ పుట్టిన తేదీ, సంతకం, వివాహ తేదీ, కుటుంబ సభ్యుల పేర్లు, ID ప్రూఫ్, మొదలైన వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

బ్యాంక్ భద్రతకు సంబంధించిన సలహాలు.. సాధారణంగా అన్ని బ్యాంకులు ఈ-మెయిల్, సోషల్ మీడియా ద్వారా భద్రతా సలహాలను కస్టమర్లకు అందిస్తుంటాయి. వాటి ద్వారా ఖాతాదారులు మోసాల బారిన పడకుండా తమ నగదును కాపాడుకోవచ్చు. ఆ సలహాలు, సూచనలను తప్పకుండా పాటించండి.

బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మెసేజ్‌లను చూసుకోండి.. మీ బ్యాంక్ ఖాతాపై నిఘా ఉంచండి. ఎందుకంటే ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే, వాటిని వెంటనే తెలుసుకోవచ్చు. కస్టమర్లకు లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్యాంకులు మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ల రూపంలో పంపిస్తుంటాయి. బ్యాంక్ సందేశాలు మోసపూరిత లావాదేవీలను గుర్తించడంలో సహాయపడతాయి

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!