Back Pain Remedies: వెన్నునొప్పికి దాల్చిన చెక్కతో ఉపశమనం.. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనం..
Back Pain Home Remedies: మీరు కూడా వెన్నునొప్పి(Back Pain) సమస్యతో బాధపడుతూ పని చేయడంలో ఇబ్బందిగా ఉంటే పెయిన్‌కిల్లర్‌కు బదులుగా కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దాల్చిన చెక్కను..
బిజీ లైఫ్ స్టైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందు నిరంతరం పని చేయడం వల్ల చాలా మందికి వెన్ను నొప్పి(Back Pain) సమస్య మొదలవుతోంది. ఈ మధ్యకాలంలో వెన్నునొప్పి సమస్య వృద్ధులకే కాదు..నేటి తరం యువత కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అంతా వర్క్ ఫ్రమ్ హోంలో కంప్యూటర్లతో కుస్తీలు పట్టడమే అని చెప్పవచ్చు. అయితే.. వెన్ను నొప్పి కారణంగా ఎవరికీ ఏ పని చేయాలని అనిపించదు. కొన్నిసార్లు వెన్నునొప్పి ఎక్కువగా పెరిగి కూర్చోవడం కూడా కష్టమవుతుంది. మీరు కూడా వెన్నునొప్పి(Back Pain) సమస్యతో బాధపడుతూ పని చేయడంలో ఇబ్బందిగా ఉంటే పెయిన్‌కిల్లర్‌కు బదులుగా కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా మీరు మీ వెన్నునొప్పి సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు. దీనిని తిన్న వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది. అది ఎలానో తెలుసుకుందాం.
వెన్నునొప్పి సమస్యకు దాల్చిన చెక్కతో చెక్..
దాల్చిన చెక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి అనేక మూలకాలు ఉంటాయి. ఇది కాకుండా, ఇందులో సిన్నమాల్డిహైడ్, సిన్నామిక్ యాసిడ్ వంటి యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలోని దెబ్బతిన్న కణాలను సరిచేయడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, కీళ్ళు, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి
- వెన్నునొప్పి సమస్యను దూరం చేయడానికి రెండు గ్రాముల దాల్చిన చెక్క పొడిలో ఒక టీస్పూన్ తేనెను కలపండి. ఇప్పుడు తినండి. దీన్ని రోజుకు కనీసం 2 సార్లు చేయండి మంచిది. ఇలా చేయడం ద్వారా మీరు త్వరలోనే ఈ చిట్కా ప్రభావాన్ని చూస్తారు.
- కావాలంటే దాల్చిన చెక్కతో హెల్తీ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని కోసం పాన్‌లో ఒక కప్పు నీరు తీసుకోండి. ఆ తర్వాత అందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి తక్కువ మంట మీద మరిగించాలి. ఇప్పుడు దానిని ఒక కప్పులో వడపోసి.. ఒక చెంచా తేనెతో కలుపుకుని తినండి. ఉదయం, రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకోండి. అతి కొద్ది రోజుల్లోనే మీకు పెద్ద ఉపశమనం లభిస్తుంది.
హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి: Ramya Murder Case: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో విచారణ పూర్తి.. ఇవాళ కోర్టు తీర్పు
Acharya Movie Release Live: ప్రేక్షకుల ముందుకు ఆచార్య.. కోలాహలంగా మారిన థియేటర్స్.. అభిమానుల రచ్చ