AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea and Diabetes: ఈ స్పెషల్ టీ డయాబెటిక్ పేషెంట్‌కి దివ్యౌషధం.. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇలా వాడండి..

దేశంలో రోజురోజుకు మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా మారుతున్న జీవనశైలి.. సరికాని ఆహారం కారణంగా. దీనితో బాధపడుతున్న రోగులు చాలా మందులు తీసుకోవడమే కాకుండా తీపి పదార్థాలకు దూరంగా..

Tea and Diabetes: ఈ స్పెషల్ టీ డయాబెటిక్ పేషెంట్‌కి దివ్యౌషధం.. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇలా వాడండి..
Hibiscus Tea For Diabetes
Sanjay Kasula
|

Updated on: Apr 29, 2022 | 11:56 PM

Share

మధుమేహ(Diabetes) బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం..  మారుతున్న జీవనశైలి.. సరికాని ఆహారంతో ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఒక్కసారి మధుమేహ సమస్య వస్తే జీవిత కాలం ఆరోగ్య నియమాలు పాటించాలి. అంతే రక్తంలో చెక్కర స్థాయి అదుపులో ఉంచుకునేందుకు నిత్యం నియమాలను అనుసరించాల్సి ఉంటుంది. చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు టీలు తాగేందుకు ఇష్టపడుతుంటారు. చాయ్ ఎలా చేసుకోవాలని.. అందులో పాలు ఏ మోతాదాలో కలుపుకోవాలనే నియమాలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యమంగా టీ (Tea)తాగడానికి ఇ మీరు మందార టీని తాగండి. దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మందార టీని ఎలా తీసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

మందార అంటే ఏమిటి?

మందార పువ్వు ఒక రకమైన పువ్వు, ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మనం ఇప్పటి వరకు మందార పువ్వులను అలంకరనలో మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఆరోగ్యానికి దివ్యమైన ఔషదంలా పని చేస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అద్భుమైన మందార చాయ్ ని కూడా తీసుకుంటారని మీకు తెలుసా? అవును.. మందార టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పువ్వులు ఎంత అందంగా ఉంటాయో, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

మందారలో కనిపించే లక్షణాలు – 

మందార పువ్వులు, ఆకులలో బీటా-కెరోటిన్, విటమిన్-సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మందార పువ్వులు మీకు ఉపయోగించండి.

మందార టీ ఎలా తయారు చేయాలి

  • మందార టీ తయారు చేయడానికి ముందుగా.. మందార పువ్వులను కడిగి, దాని రేకులను వేరు చేయండి.
  • దీని తరువాత, పాన్లో నీరు మరిగించాలి.
  • నీళ్లు మరిగేటప్పుడు అందులో రెండు మందార పూల రేకులను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తర్వాత ఒక కప్పులో జల్లెడ పట్టాలి.
  • ఇప్పుడు అందులో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.
  • కావాలంటే దీని పూలను ఎండబెట్టి పొడి చేసి కూడా వాడుకోవచ్చు.
  • మీరు మార్కెట్‌లో మందార టీని వదులుగా ఉండే పొడి, టీ బ్యాగ్‌ల రూపంలో కూడా ఉపయోగించవచ్చు.

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది

మీరు ఒత్తిడితో పోరాడుతున్నట్లయితే మందార టీ మీకు ఉపయోగపడుతుందని నిరూపించవచ్చు. దీన్ని తాగడం వల్ల అలసట, ఒత్తిడి దూరం అవుతాయి. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది.

బరువు తగ్గుతారు

బరువు తగ్గడంలో మందార కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిజానికి ఇందులో ఉండే గుణాలు మీ జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మీ బరువును తగ్గించుకోవచ్చు.

వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది

మీరు వైరల్ సంక్రమణను నివారించడానికి మందారను ఉపయోగించవచ్చు. ఇది బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.

హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Ramya Murder Case: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో విచారణ పూర్తి.. ఇవాళ కోర్టు తీర్పు 

Acharya Movie Release Live: ప్రేక్షకుల ముందుకు ఆచార్య.. కోలాహలంగా మారిన థియేటర్స్.. అభిమానుల రచ్చ