Health Tips: ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..

Health Tips: ఊబకాయం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణం మారాయి. అసలు మన అలవాట్లతోనే ఇలా జరుగుతోందని చాలా మందికి అర్థం కాదు. ఎసిడిటీ, మలబద్ధకం..

Health Tips: ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..
Bath After Eating Food Be
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 29, 2022 | 11:33 PM

ఊబకాయం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణం మారాయి. అసలు మన అలవాట్లతోనే ఇలా జరుగుతోందని చాలా మందికి అర్థం కాదు. ఎసిడిటీ, మలబద్ధకం వల్ల బరువు పెరగడం మొదలవుతుంది. ఇవన్నీ మన చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల ఫలితమేగా ఇలా జరుగుతుంది. అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తప్పుడు అలవాట్లకు దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనది రోజు మనం తినే ఆహారం. ఇందులో మనం తెలుసుకోవల్సినది ఆహారం తిన్న తర్వాత.. ఆహారం తినక ముందు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఆహారం తిన్న తర్వాత స్నానం చేయడం, పండ్లు తినడం, వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత అంటే భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు నడవండి చాలా మంచిది. ఇలాంటి కొన్ని నియమాలను పాటించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఆహారం తీసుకోవద్దు

మీరు భోజనం లేదా అల్పాహారం తీసుకున్న వెంటనే తలస్నానం చేయడం అస్సలు మంచిది కాదు. ఈ సంగతిని చాలా కాలంగా మన ఇంట్లోని పెద్దలు చెప్పినవే.. అందుకే స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలని సూచిస్తారు. దాని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. నిజానికి ఆహారం తిన్న తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.. కాబట్టి తిన్నటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. కానీ అదే సమయంలో మీరు స్నానం చేస్తే ఉష్ణోగ్రత మారిపోతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

భోజనం తర్వాత పండ్లు తినకూడదు

భోజనం తర్వాత పండ్లు ఎప్పుడూ తినకూడదు. అయితే సహజంగా మనం భోజం చేసిన తర్వాత పండ్లు తింటే మంచిది అనే ప్రచారం ఉంది. కాని, ఇది అన్ని సమయాల్లో మంచిది కాదు. మన జీర్ణ వ్యవస్థ వివిధ రకాలుగా పని చేస్తుంది. పండ్లను జీర్ణం చేసే సమయం వేరు, భోజనం జీర్ణమయ్యే సమయం వేరుగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు విడిగా ఉంటుంది.. ఇలా భోజనం చేసిన తర్వాత పండ్లు తీసుకోవద్దు. ఇలా తీసుకుంటే ఎసిడిటీ సమస్యలు రావచ్చు.

తిన్న తర్వాత ధూమపానం చేయవద్దు

చాలా మందికి ఆహారం తిన్న వెంటనే పొగతాగే అలవాటు ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల మీ బరువు పెరగడంతోపాటు.. శ్వాస క్రియలో సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

నిద్ర మానుకోండి

మీరు భోజనం చేసిన వెంటనే పడుకుంటే లేదా నిద్రలోకి జారుకుంటే.. మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుంది. ఇలా నిత్యం చేయడం వల్ల జీర్ణక్రియ మరింత చెడిపోతుంది. ఇలా రాబోయే రోజుల్లో మీకు మలబద్ధకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, ఆహారం తిన్న తర్వాత, 10 నిమిషాలు తప్పనిసరిగా నడవండి. నడిచిన తర్వాత వెంటనే నిద్రపోకుండా.. నడకకు… నిద్రకు మధ్య 2 గంటల  సమయం తప్పని సరిగా ఉండేలా చూసుకోండి.

వ్యాయామం చేయవద్దు

నిత్యం వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే వ్యాయామం ఎప్పుడు.. ఏ సమయంలో చేయాలనే కూడా చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యమైనది.. గుర్తుంచుకోవల్సినది ఆహారం తీసుకున్న తర్వాత అంటే భోజనం చేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో కూడా వ్యాయామం చేయవద్దు. భోజనం తర్వాత వ్యాయామం చేస్తే మీ జీర్ణక్రియ ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడుతాయి. మీకు కడుపు నొప్పి, వాంతులు మొదలైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.  ఇలాంటి కొన్నింటిని తప్పనిసరిగా అనుసరించాలి.

హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి: Ramya Murder Case: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో విచారణ పూర్తి.. ఇవాళ కోర్టు తీర్పు 

Acharya Movie Release Live: ప్రేక్షకుల ముందుకు ఆచార్య.. కోలాహలంగా మారిన థియేటర్స్.. అభిమానుల రచ్చ