Skin Cancer: అధిక సూర్యకాంతి వల్ల చర్మ క్యాన్సర్‌.. లక్షణాలు ఏమిటి? రక్షించుకునేందుకు చిట్కాలు!

Skin Cancer: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది.. ఎండలు, వేడి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడి కారణంగా హిట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం..

Skin Cancer: అధిక సూర్యకాంతి వల్ల చర్మ క్యాన్సర్‌.. లక్షణాలు ఏమిటి? రక్షించుకునేందుకు చిట్కాలు!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 29, 2022 | 10:22 AM

Skin Cancer: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది.. ఎండలు, వేడి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడి కారణంగా హిట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ఎండాకాలం (Summer)లో భారీ వేడి కారణంగా మీరు చర్మ క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని నిపునులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్‌ను మెలనోమా స్కిన్ క్యాన్సర్ అంటారు. సూర్యుని బలమైన కిరణాలకు నేరుగా బహిర్గతమయ్యే అవయవాలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా సంభవిస్తుంది. ఈ సమయంలో ప్రజలు ఈ సూర్యుని ప్రశాతం నుంచి తమను తాము రక్షించుకోవాలని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి.

సూర్యరశ్మి మన శరీరానికి మేలు చేస్తుందని, అయితే ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య సూర్యరశ్మిని వల్ల మేలే జరుగుతుందని, ఆ తర్వాత బయటకు వెళ్లినట్లయితే వడదెబ్బ బారిన పడటం, ఇతర వ్యాధుల బారిన పడటం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మి వల్ల విటమిన్-డి కూడా పొందుతారు. ఇది మనిషికి ఎంతో అవసరం. రాజీవ్ గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని ఆంకాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ వినీత్ తల్వార్ మాట్లాడుతూ.. శరీరంలోని కణాలలో అసాధారణ పెరుగుదల కారణంగా క్యాన్సర్ వస్తుందని వివరించారు. సూర్యకిరణాల నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల (UV కిరణాలు) వల్ల చర్మ క్యాన్సర్ వస్తుంది. ఇది కాకుండా కుటుంబ చరిత్ర, తక్కువ రోగనిరోధక శక్తి, రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో చర్మ క్యాన్సర్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, ఎండలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు.

ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల ప్రమాదం

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరు ఎక్కువసేపు భారీ వేడిగా ఉన్న సూర్యకాంతిలో ఉంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ముదురు రంగు చర్మం ఉన్నవారి కంటే సాధరాణ వ్యక్తులకు చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొందరి వ్యక్తులకు శరీరంలో మెలనిన్ తక్కువగా ఉంటుంది. ఈ మెలనిన్ చర్మ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

ఈ క్యాన్సర్‌ లక్షణాలు:

☛ శరీరం మొటిమలు

☛ చర్మంపై తెల్లటి మచ్చలు

☛ చర్మంపై ఓపెన్ పుండ్లు

☛ మెడ మీద ఎరుపు పాచ్ ఏర్పడటం

☛ చర్మంలో కొన్ని మార్పులు రావడం

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!

Oral Cancer: ఇలాంటి అలవాట్ల కారణంగా నోటి క్యాన్సర్‌.. లక్షణాలు ఏమిటి..!