AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!

Summer Food Tips: ఇప్పుడు సమ్మర్‌ సీజన్‌ కొనసాగుతోంది. ఈ కాలంలో ఇంట్లో ఏదీ వండినా త్వరగా పాడువుతుంది. మిగితా కాలాలతో పోల్చితే ఈ ఎండాకాలంలో వండిన ఆహారం..

Summer Food Tips: ఎండాకాలంలో ఆహార పదార్థాలు పాడైపోతున్నాయా.? ఇలా చేయండి తాజాగా ఉంటాయి!
Subhash Goud
|

Updated on: Apr 27, 2022 | 1:57 PM

Share

Summer Food Tips: ఇప్పుడు సమ్మర్‌ సీజన్‌ కొనసాగుతోంది. ఈ కాలంలో ఇంట్లో ఏదీ వండినా త్వరగా పాడువుతుంది. మిగితా కాలాలతో పోల్చితే ఈ ఎండాకాలంలో వండిన ఆహారం త్వరగా పాడయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం (Health) కోసం పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహార పదార్థాల (Food) విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమ్మర్‌ సీజర్‌లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం కష్టమైపోతుంది. ఉదయం వండిన పదార్థాలు రాత్రి వరకు పాడైపోతుంటాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వడిపోతాయి. ఇక పాలు, పెరుగు సంగతైతే పెద్దగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఫ్రిజ్‌ ఉన్నవారికి కొంత నయం. లేని వారి సంగతి అయితే అంతే. ఏ పదార్థాలు అయినా త్వరగా పాడైపోతాయి. మరి భారీ ఎండల్లోనూ ఆహార పదార్థాలు తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

  1. మిగతా రోజులతో పోలిస్తే.. ఫ్రిజ్‌ ఉష్ణోగ్రతను తగ్గించి 5 డిగ్రీల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. తాజా గుడ్లు, మాంసాన్ని తప్పకుండా ఫ్రిజ్‌లోనే నిల్వచేయాలి. బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వండిన పదార్థాలను, పచ్చి కూరగాయలను వేరువేరు అరల్లో సర్దుకోవడం మంచిది.
  2. కూరలు, పుసులులు, పాలువంటి వాటిని కొద్ది గంటల వ్యవధితో తరచుగా వేడి చేస్తూ ఉండటం మంచిది. కాస్త వేడి కాగానే దించేయకుండా మరుగు వచ్చేంతవరకు స్టవ్‌ మీద ఉంచాలి. దీని వల్ల పాడవకుండా ఉంటాయి.
  3. వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తరిగాక, గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచడం మంచిది. దీని వల్ల తాజాగా ఉంటాయి.
  4. ఫ్రిజ్‌లోంచి తీసిన పదార్థాలను వెంటనే కాకుండా, కాసేపటి తర్వాత వండుకోవడం మంచిది.
  5. ఇక పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్‌లోనే నిలువ చేయాలి. ఫ్రిజ్‌లో ఇరుకుగా ఉన్న డబ్బాలు పెట్టకూడదు. కాస్త మధ్య మధ్యలో గ్యాస్‌ ఉండేలా సర్దుకోవాలి. ఇరుకుగా ఉన్న డబ్బాలు పెట్టకూడదు. గాలి ఆడేందుకు ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి.. అప్పుడే అందులోని పదార్థాలు పాడవకుండా తాజాగా ఉంటాయి.
  6. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారిన తర్వాతే బాక్సుల్లో పెట్టుకోవాలి. వీలైతే కూల్‌ కంటైనర్‌లో సర్దుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Diet for Diabetes: మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి 6 ఆరోగ్యకరమైన ఆహారాలు

Oral Cancer: ఇలాంటి అలవాట్ల కారణంగా నోటి క్యాన్సర్‌.. లక్షణాలు ఏమిటి..!