Health Tips: పాలు-పుచ్చకాయ కలిపి తింటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
Watermelon - Milk combination : దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, చల్లగా ఉండేందుకు ప్రజలు అనేక రకాల ఆహారాలు, పానీయాలను తీసుకుంటుంటారు.
Watermelon – Milk combination : దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు, చల్లగా ఉండేందుకు ప్రజలు అనేక రకాల ఆహారాలు, పానీయాలను తీసుకుంటుంటారు. వేసవి కాలంలో చాలా మంది పుచ్చకాయను పాలలో కలిపి తీసుకోవడం మీరు చూసే ఉంటారు. దాని టెస్ట్‌ను ఇంకా మెరుగుపర్చేందుకు రూహ్ అఫ్జాను కూడా మిక్స్ చేస్తారు. అయితే.. ఒకవేళ మీరు పాలు – పుచ్చకాయ కాంబినేషన్లో డ్రింక్ తాగినా.. తిన్నా అప్రమత్తంగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని పేర్కొంటున్నారు.
ఆయుర్వేదంలో పాలు – పుచ్చకాయలను కలిపి తీసుకోవడం నిషేధం..
పుచ్చకాయ – పాలు కలిపి తీసుకోవడం వలన మీరు అనారోగ్యానికి గురవుతారు. ఇది తీవ్రమైన ఉదర సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. పాలు- పుచ్చకాయలను కలిపి తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. పుచ్చకాయ, పాలు రెండూ వేర్వేరు స్వభావాలను కలిగి ఉండటమే దీనికి కారణం. వీటి రుచులు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా హాని కలుగుతుంది.
పాలలో పెద్ద మొత్తంలో ప్రోటీన్ లభిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. దీనితో పాటు కొవ్వు కూడా ఇందులో ఉంటుంది. మరోవైపు పుచ్చకాయ శరీరాన్ని చల్లబరిచే పండు. ఇందులో పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో.. పాలు – పుచ్చకాయ కలయిక సరైనది కాదు. పాలతో మిక్స్ చేసినప్పుడు పుచ్చకాయ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
సమస్యలు తీవ్రమయ్యే అవకాశం..
పాలు – పుచ్చకాయలను కలిపి తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇలాంటి కాంబినేషన్‌కు దూరంగా ఉండాలి. పాలు, పుచ్చకాయలను విడివిడిగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలలో ఉండే ప్రోటీన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో పెద్ద మొత్తంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి పుచ్చకాయలో కనిపిస్తాయి. ఇందులో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. కావున వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read: