Oral Cancer: ఇలాంటి అలవాట్ల కారణంగా నోటి క్యాన్సర్.. లక్షణాలు ఏమిటి..!
Oral Cancer: ఆరోగ్యం బారిన పడేవారు జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది. జీవనశైలి కారణంగా ఇష్టానుసారంగా ఆహారాలను తీసుకోవడం వల్ల పలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ..
Oral Cancer: ఆరోగ్యం బారిన పడేవారు జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది. జీవనశైలి కారణంగా ఇష్టానుసారంగా ఆహారాలను తీసుకోవడం వల్ల పలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక తల భాగంలో శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు అంటారు. పెదాలు, నోరు, చిగుర్లు, నాలుక, నాసల్‌క్యాలిటీ ఫారింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్లు తలెత్తుతాయి. ఇవి 90% వరకూ స్కామస్ (Squamous) సెల్ కార్సినోమా రకానికి చెందినవని నిపుణులు చెబుతున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ల మాదిరిగానే.. ఇక ఊపిరితిత్తుల క్యాన్సర్ల మాదిరిగానే వీటికి కూడా ఆల్కహాల్, పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) కూడా ఒక కారణం. ఆల్కహాల్, పొగాకు అలవాట్లు రెండూ అలవాట్లు ఉన్నట్లయితే ఈ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. HPV వైరస్ 16 నుంచి 18 రకాలను నాలుక మొదటి భాగంలో, టాన్సిల్స్ ఇంకా కొన్ని రకాల తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లకు కారణాలు. అయితే నోటిని శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. చాలా మంది ఉదయం లేవగానే సరిగ్గా బ్రేష్ వేసుకోకపోవడం, నోటిని సరిగ్గా కడుక్కోకపోవడం, గుట్కాలు, అల్కాహాలు, ఇతర దూరలవాట్ల కారణంగా వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు వైద్య నిపుణనులు.
లక్షణాలు:
అలాగే నోటిలో తెలుపు, ఎరుపు మిళితమైన మచ్చలు, గొంతునొప్పి కారణంగా బొంగురు పోయి ఉండటం, మింగడానికి ఇబ్బందికరంగా ఉండటం, దవడల భాగంలో వాపుగా రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, మాట్లాడటానికి కష్టంగా ఉండటం, అధిక తలనొప్పి, వినికిడిశక్తి తగ్గిపోవడం, చెవిపోటు.. ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. దంతాలు కొనదేలి పదేపదే పెదాలలో లేక నోటి లోపలి భాగంలో పుండు పడేటట్లు చేసినా, ప్రాంతాలను బట్టి ఉండే అలవాట్లు, HIV వైరస్, పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్, ఎప్‌స్టియన్ బార్ (Epssstein Baar) వైరస్, నిల్వ ఉండే ఆహార పదార్థాలు, చెక్కపొడి, ఆస్‌బెస్టాస్, మెటల్, టెక్స్‌టైల్ రంగాలలో పనిచేసే వారికి, ఇతర ఆరోగ్య సమస్యలకు తలభాగంలో ఇచ్చే రేడియేషన్ ఈ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి లక్షణాలలు ఉంటనే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. అందుకే సర్జరీలను చాలా జాగ్రత్తతో చేసే అనుభవజ్ఞులైన వైద్యుల దగ్గరే చేయించుకోవడం మంచిదంటున్నారు.
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ప్రధానంగా ఓరల్ క్యావిటి, ఫారింజియల్, లారింజియల్, పారానాసల్ సైనసెస్ మరియు నాసల్ క్యావిటి, లాలాజల (Salivary) గ్రంథులు.. భాగాలలో ఎక్కువగా వస్తుంటాయి. మనదేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ క్యాన్సర్‌కు సంబంధించినదై ఉంటుందని సూచిస్తున్నారు. ఈ క్యాన్సర్లకు గురైన మరణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నం కలిపి ఎక్కువసేవు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లు ఈ క్యాన్సర్ల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఇలాంటి క్యాన్సర్లను తొలిదశలోన గుర్తిస్తే శాశ్వతంగా పరిష్కరించవచ్చు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే చాలామందిలో డెంటిస్ట్ దగ్గరికి వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యలు బయటపడతాయి. అందుకే నోటి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏదైనా చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా వీటిపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.
(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణులు, పరిశోధకుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: