Women Health: మగువలకి గమనిక.. ఆరోగ్యకరమై హృదయం కోసం ఏడు జాగ్రత్తలు..!

Women Health: ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా మందిలో వస్తున్నాయి. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్య

Women Health: మగువలకి గమనిక.. ఆరోగ్యకరమై హృదయం కోసం ఏడు జాగ్రత్తలు..!
Health
Follow us

|

Updated on: Apr 26, 2022 | 12:48 PM

Women Health: ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా మందిలో వస్తున్నాయి. అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలు తమ హృదయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ప్రతిరోజు 7 జాగ్రత్తలు పాటించాలి. మహిళల్లో గుండె జబ్బులు, ఊబకాయం, చెడ్డ జీవనశైలి, మధుమేహం వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయి. అందుకే ప్రతిరోజు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల గురంచి తెలుసుకుందాం.

1. ధూమపానం మానేయండి

ధూమపానం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మహిళలు కచ్చితంగా ధూమపానానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ధూమపానం చేస్తే గర్భధారణలో సమస్యలు ఉంటాయి. అంతేకాదు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం చేయని మహిళల ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది.

2. ధ్యానం చేయండి

హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మహిళలు ఎల్లప్పుడూ ధ్యానం చేయాలి. అప్పుడే మీరు రిలాక్స్‌గా ఉంటారు. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రోజూ దాదాపు 30 నిమిషాల పాటు యోగా చేయాలి. పనిచేసే మహిళలకు ధ్యానం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.

3. సరియైన నిద్ర

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. మీరు సరిగ్గా నిద్రపోకపోతే అది మీ గుండెపై ప్రభావం చూపుతుంది. పని ఒత్తిడి పెరగడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మహిళలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల సరిపడ నిద్ర పోవడం లేదు. ఈ పరిస్థితిలో శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

4. ఆహారంలో మార్పులు చేసుకోవాలి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హైబీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన తక్కువ నూనెతో కూడిన ఆహారాన్ని మాత్రమే తినాలి.

5. గర్భ నిరోధక మాత్రలు తీసుకోవద్దు

అవాంఛిత గర్భధారణను నివారించడానికి మాత్రలు తీసుకోకూడదు. ఇవి మీ శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక వినియోగం ఈస్ట్రోజెన్ హార్మోన్ మొత్తాన్ని పెంచుతుంది. ఈ మాత్రలు గుండెపై ప్రభావం చూపుతాయి. వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

6. బరువు నియంత్రణలో ఉండాలి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువుతో బాధపడేవారు గుండె సమస్యలకి గురవుతారు. బరువు తగ్గడానికి వీలైనంత చక్కెర పదార్థాలని తగ్గించండి.

7. హృదయ స్పందన రేటును గమనించండి

అప్పుడప్పుడు హృదయ స్పందన రేటుని తనిఖీ చేసుకోవాలి. ప్రతి రోజు 45 నిమిషాల వ్యాయామం చేయాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Summer Skin Care: ఎండాకాలంలో రోజ్‌ వాటర్‌తో ఇలా చేస్తే చర్మం కాంతివంతం..!

RR vs RCB Prediction: ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్‌.. బెంగుళూరుకి విజయం అంత సులువు కాదు..!

CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు..10వ తరగతిలో 25 కొత్త టాపిక్‌లు..12వ తరగతిలో 30 కొత్త టాపిక్‌లు..!