AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs RR Prediction: ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్‌.. బెంగుళూరుకి విజయం అంత సులువు కాదు..!

RCB vs RR IPL 2022 Match Prediction: పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్

RCB vs RR Prediction: ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్‌.. బెంగుళూరుకి విజయం అంత సులువు కాదు..!
Rr Vs Rcb
uppula Raju
| Edited By: Narender Vaitla|

Updated on: Apr 26, 2022 | 6:32 PM

Share

RCB vs RR IPL 2022 Match Prediction: పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌పైనే ఉంది. బట్లర్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బట్లర్‌ని తొందరగా ఔట్‌ చేసి రాజస్థాన్‌పై ఒత్తిడి తీసుకురావడమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో గత రెండు మ్యాచ్‌లలో గోల్డెన్ డక్ బాధితుడైన విరాట్ కోహ్లీపై కూడా అందరి దృష్టి నెలకొంది. కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఇతర బ్యాట్స్‌మెన్ కూడా మెరుగ్గా రాణిస్తారని RCB ఆశిస్తోంది. రాజస్థాన్ జట్టు గత రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ RCB ఆటగాళ్లు ప్రమాదకరమే

ప్రస్తుతం అందరి దృష్టి కోహ్లిపైనే ఉంటుంది కానీ RCBలో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ వంటి భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వీరంతా ఏకతాటిపై రాణిస్తే రాజస్థాన్ బౌలర్లకి కష్టమవుతుంది. ప్రస్తుత సీజన్‌లో బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేసిన డు ప్లెసిస్ కొంచెం ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. అలాగే దినేశ్‌ కార్తీక్ ఫినిషర్ పాత్రను బాగా పోషిస్తున్నాడు.

రాజస్థాన్‌ అద్భుత బౌలింగ్‌

ట్రెంట్ బౌల్ట్ నేతృత్వంలో రాజస్థాన్ బౌలింగ్‌ అద్భుతంగా కొనసాగుతోంది. బౌల్ట్ గతంలో ఇన్‌కమింగ్ డెలివరీలతో కోహ్లీని ఇబ్బంది పెట్టాడు. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌ల స్పిన్ ద్వయం ఉండనే ఉంది. చాహల్ టోర్నీలో ఇప్పటివరకు 18 వికెట్లు పడగొట్టాడు. ఒంటరిగా మ్యాచ్ పరిస్థితిని మార్చగల సత్తా చాహల్‌కి ఉంది. అశ్విన్ ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్‌నైనా చిత్తు చేయగలడు. ఇది కాకుండా ఒబెడ్ మెక్‌కాయ్ కూడా ఉన్నాడు. దీని కారణంగా రాజస్థాన్ బౌలింగ్ దాడి చాలా సమతుల్యంగా కనిపిస్తుంది. రాజస్థాన్ కోసం ఓపెనర్ బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇతర ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, కెప్టెన్ సంజూ శాంసన్ కూడా బ్యాట్‌తో సహకారం అందిస్తారు. షిమ్రాన్ హెట్మెయర్ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెసిస్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, జోష్ హేజిల్‌వుడ్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, మహిపాల్ లోమ్రోడ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సుయాష్ ప్రభుదేశాయ్, చామా మిలింద్, అనీశ్వర్ గౌతమ్, కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లీ, రజత్ పాటిదార్, సిద్ధార్థ్ కౌల్.

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్) యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, శుభమ్ గర్వాల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, తేజస్ బరోకా, అనునయ్ సింగ్, కెసి కరియప్ప, సంజు శాంసన్, జోస్ బట్లర్, రాసి వాన్ డెర్ డుసైన్-నాథన్, నాథన్ , జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రశాంత్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు.. 10వ తరగతిలో 25 కొత్త టాపిక్‌లు.. 12వ తరగతిలో 30 కొత్త టాపిక్‌లు..!

నేడు Nokia G21, Nokia G11 మొబైల్స్‌ లాంచ్.. ధర, ఫీచర్లు గురించి తెలుసుకోండి..!

British Woman: 99 ఏళ్ల వయసులో యుద్ద విమానం నడిపిన మహిళ.. ఆమె ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే..!