నేడు Nokia G21, Nokia G11 మొబైల్స్‌ లాంచ్.. ధర, ఫీచర్లు గురించి తెలుసుకోండి..!

Nokia G21Nokia G11: నోకియా భారతదేశంలో రెండు కొత్త G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. నోకియా G21, G11 ఫోన్లని మధ్యాహ్నం

నేడు Nokia G21, Nokia G11 మొబైల్స్‌ లాంచ్.. ధర, ఫీచర్లు గురించి తెలుసుకోండి..!
Nokia G21 Nokia G11
Follow us

|

Updated on: Apr 26, 2022 | 10:53 AM

Nokia G21Nokia G11: నోకియా భారతదేశంలో రెండు కొత్త G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. నోకియా G21, G11 ఫోన్లని మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ చేయనుంది. ఈ రెండు ఫోన్లకి ధర దాదాపు రూ.15,000లోపు ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో నోకియా UAE వంటి ఎంపిక చేసిన మార్కెట్లలో ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. Nokia G11, Nokia G21 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల గురంచి తెలుసుకుందాం.

Nokia G21 స్పెసిఫికేషన్స్

Nokia G21.. Nokia G20కి సక్సెసర్‌గా లాంచ్ అవుతుంది. ఇది ఫ్రంట్‌ కెమెరా కోసం ఎగువన వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.5-అంగుళాల IPS LCDని కలిగి ఉంటుంది. డిస్ప్లే HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. Nokia G21 Unisoc T606 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 6GB RAM, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. USB టైప్-సి ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5050 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్‌ సైడ్‌ G21 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 2MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 50MP ప్రధాన కెమెరాతో అనుసందానమై ఉంటుంది. సెల్ఫీల కోసం పరికరంలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో నడుస్తుంది. కనెక్టివిటీ వారీగా ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్, 4G VoLTE, బ్లూటూత్, GPS, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వైఫై మొదలైనవి ఉంటాయి.

Nokia G11 స్పెసిఫికేషన్స్

G11 ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.5-అంగుళాల HD+ IPS LCDని కలిగి ఉంది. ఇది అదే Unisoc T606 SoCతో వస్తుంది. అయితే ఫోన్ 3GB, 4GB RAMతో పాటు 64GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాక్‌ సైడు ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 13MP ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2MP సెన్సార్లతో వస్తుంది. ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. G21 వలె, G11 5050 mAh బ్యాటరీ కోసం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్‌తో నడుస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

British Woman: 99 ఏళ్ల వయసులో యుద్ద విమానం నడిపిన మహిళ.. ఆమె ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే..!

చాణక్య నీతి: ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తిని పరీక్షించడానికి ఈ మార్గాలు చాలు..!

Viral Video: ఈ హెయిర్‌ స్టైల్‌ చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.. ట్రై చేయండి..!