Smartphone Reset: మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించే ముందు మీ వ్యక్తిగత డేటా మొత్తాన్ని ఇలా తొలగించండి..!

Smartphone Reset: మార్కెట్లో రోజురోజుకు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లు రావడంతో పాత ఫోన్‌ను పక్కనబెట్టి కొత్త ఫోన్లను తీసుకుంటున్నారు..

Smartphone Reset: మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించే ముందు మీ వ్యక్తిగత డేటా మొత్తాన్ని ఇలా తొలగించండి..!
Follow us

|

Updated on: Apr 26, 2022 | 10:26 AM

Smartphone Reset: మార్కెట్లో రోజురోజుకు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లు రావడంతో పాత ఫోన్‌ను పక్కనబెట్టి కొత్త ఫోన్లను తీసుకుంటున్నారు. అయితే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత పాత ఫోన్‌ను తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. కానీ పాత ఫోన్‌లో ఉన్న డేటా, ఇతర వివరాలను అలాగే ఉంచేస్తున్నారు. దీని వల్ల మీకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. పాత స్మార్ట్‌ఫోన్‌ల నుండి డేటాను బదిలీ చేయడం లేదా డేటాను తొలగించడం చాలా కష్టమైన పని. పాత మొబైల్‌ని విక్రయించేటప్పుడు లేదా మార్చేటప్పుడు చాలా సార్లు వ్యక్తిగత డేటా అందులోనే ఉంటుంది. ఇది వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశాలను పెంచుతుంది. Android స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ (Smartphone Reset) చేసే ప్రక్రియ చాలా తక్కువ సమయం పడుతుంది. అందుకే మీరు పాత స్మార్ట్‌ఫోన్ నుండి మీ మొత్తం డేటాను ఎలా తొలగించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసే ప్రక్రియ ఏమిటో చూద్దాం.

ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా ఏది చేయాలన్న సులభమే అవుతుంది. వ్యక్తిగత డేటాను తొలగించడానికి లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇది సులభమైన ప్రక్రియ. శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్, గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లో రీసెట్ లేదా ఎరేజ్ చేసే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మీరు సెట్టింగ్‌లోకి వెళ్లడం ద్వారా రీసెట్ లేదా ఎరేజ్ చేయవచ్చు. ఫోన్‌ను రీసెట్‌ చేయడం ఎలానో తెలుసుకుందాం.

ముందుగా మీ మొబైల్‌లోని వాట్సాప్‌, ట్విటర్‌, ఎంఎస్‌ ఆఫీస్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ అకౌంట్‌, జీమెయిల్‌ వంటి అకౌంట్లను లాగౌట్ చేయండి. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్‌లో అకౌంట్స్‌లోకి వెళ్లి ఒక్కో ఖాతా నుంచి లాగౌట్ చేస్తే సరిపోతుంది. చివరిగా మీ గూగుల్ అకౌంట్‌ నుంచి లాగౌట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పాత ఫోన్‌లోని వివరాలు సింక్‌ కాకుండా ఉంటాయి. ఆ తర్వాత మొబైల్‌లో మైక్రో ఎస్‌డీ కార్డు, సిమ్‌ కార్డులను తొలగించాలి. సెట్టింగ్‌లోకి వెళ్లి జనరల్‌ మేనేజ్‌మబెంట్‌పై క్లిక్‌ చేస్తే అందులో రీసెట్‌ సెక్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఫోన్ రీస్టాట్ అవుతుంది.

ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఫోన్‌ ఆన్‌ చేస్తే ఆండ్రాయిడ్ వెల్‌కమ్‌ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాంతో కొత్తగా మీ ఫోన్ ఉపయోగించేవారు తమ మీ వివరాలు తెలుసుకునేందుకు ఎలాంటి ఆస్కారం ఉండదు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. ఫ్యాక్టరీ రీసెట్ ప్రాసెస్‌ ఫోన్‌ మోడల్‌ని బట్టి మారుతుంది. ఉదాహరణకు శాంసంగ్‌ ఫోన్‌లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్‌ సెట్టింగ్స్‌లో జనరల్ మేనేజ్‌మెంట్‌లో ఉంటుంది. షావోమి ఫోన్లలో సెట్టింగ్స్‌లో అబౌట్‌ ఫోన్‌లోకి వెళ్లి డిలీట్ ఆల్‌ (ఫ్యాక్టరీ రీసెట్) పేరుతో కనిపిస్తుంది. ఐఫోన్‌లో సెట్టింగ్స్‌లో జనరల్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్‌ని సెలెక్ట్ చేయాలి. ఇలా ఒక్కో ఫోన్‌లలో ఒక్కో విధంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌ ఎలా చేరుతుంది..? సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి..?

Google: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద షాక్‌..!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!